మనసుకి నచ్చిన అమ్మాయితో నితిన్ నిశ్చితార్థం!

యంగ్ హీరో నితిన్, షాలినిల నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది..

మనసుకి నచ్చిన అమ్మాయితో నితిన్ నిశ్చితార్థం!

Updated On : December 24, 2024 / 4:19 PM IST

యంగ్ హీరో నితిన్, షాలినిల నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి గతకొద్ది రోజులుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి. షాలిని అనే అమ్మాయిని నితిన్ వివాహం చేసుకోనున్నాడని, ఏప్రిల్‌లో వీరి వివాహం జరుగనుందని కొన్నాళ్ళుగా మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఎట్టకేలకు ఫిబ్రవరి 15న నితిన్ నిశ్చితార్థం షాలినితో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 14 వాలైంటెన్స్ డే నాడు సింగిల్ యాంథెమ్ పాడుకున్న ‘భీష్మ’ ఆ మర్నాడే పెళ్లికి రెడీ అయిపోయాడు. నితిన్ గతకొంత కాలంగా తన స్నేహితురాలు షాలినీతో ప్రేమలో ఉన్నాడు. కామన్ ఫ్రెండ్ వల్ల ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు.

ఇరు కుటుంబాలవారి రిలేటివ్స్‌తో పాటు స్నేహితుల నడుమ ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘పెళ్లిపనులు ఆరంభం.. మ్యూజిక్ స్టార్ట్స్.. మీ ఆశీస్సులు కావాలి’’.. అంటూ ట్వీట్ చేశాడు నితిన్.

ఇక ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో నితిన్, షాలినీల వివాహ వేడుక నిర్వహించబోతున్నారు.  సినిమాల విషయానికొస్తే.. నితిన్, రష్మికతో నటించిన ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్) ఫిబ్రవరి 21న విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, తో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.