Yash : టాక్సిక్, రామాయణం తర్వాతే కేజీఎఫ్ 3.. తన నెక్స్ట్ సినిమాలపై యశ్ వరుస అప్డేట్స్

Yash latest update on his next films
Yash : కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యింది. ఊహించని రేంజ్ లో కాసుల వర్షాన్ని కురిపించిన ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. ఇప్పటికే రెండు పార్ట్స్ గా వచ్చిన ఈ సినిమా పార్ట్ 3పై అంచనాలను మరింత పెంచేసింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ కేజీఎఫ్ 3, టాక్సిక్ సినిమాలపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. అయన మాట్లాడుతూ… ‘టాక్సిక్ సినిమా 2024లో రిలీజ్ కావడం లేదని అన్నారు. ప్రస్తుతం రామాయణ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. ఇక ఇందులో నేను రావణ పాత్రలో నటిస్తున్నాను. టాక్సిక్ మెగా ఎంటెర్టైనర్ గా రానుంది. అలాగే దీనికి నేను కో ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నాను.
Also Read : Bigg Boss Nominations : ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎవరున్నారు..?
ఇకపోతే కేజీఎఫ్ 3 టాక్సిక్, రామాయణ సినిమాల తర్వాత వస్తుందని అన్నారు. టాక్సిక్ మూవీకి టైటిల్, ట్యాగ్ లైన్ రెండూ నేనే ఇచ్చానన్నారు. దీంతో యశ్ ఇచ్చిన ఈ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.