Chandini Chowdary : అలాంటి భర్త కావాలంటున్న హీరోయిన్.. బర్త్ డే రోజు స్పెషల్ పోస్ట‌ర్‌ ..

Chandini Chowdary : అలాంటి భర్త కావాలంటున్న హీరోయిన్.. బర్త్ డే రోజు స్పెషల్ పోస్ట‌ర్‌ ..

Heroine Chandini Chowdary special poster on her birthday from Santana Praptirastu

Updated On : October 23, 2024 / 12:38 PM IST

Chandini Chowdary : తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకుంటుంది. ఇక ప్రస్తుతం చాందిని “సంతాన ప్రాప్తిరస్తు” అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. విక్రాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో వస్తుంది. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే చాందిని చౌదరి పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుండి తన స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. ఇక ఆ పోస్టర్ లో తన పేరు కల్యాణి ఓరుగంటి అనీ, వయస్సు 23, తనది వరంగల్ అని పేర్కొన్నారు. అలాగే తనకి ఎటువంటి భర్త కావాలి అన్న విషయాన్నీ కూడా పోస్టర్ లో తెలిపారు. తనకి గవర్నమెంట్ ఉద్యోగి, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, పూర్తిగా వెజిటేరియన్ కావాలని ఉంది. ముఖ్యంగా నో టు సాఫ్ట్వేర్ అని పోస్టర్ లో పేర్కొన్నారు.

Also Read : Yash : టాక్సిక్, రామాయణం తర్వాతే కేజీఎఫ్ 3.. తన నెక్స్ట్ సినిమాలపై యశ్ వరుస అప్డేట్స్

దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక చాందిని చౌదరి ఇప్పటికే గామీ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.