లిప్ లాక్ సీన్ ఎఫెక్ట్ : షూటింగ్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

ఇటీవలికాలంలో సినిమాలలో లిప్‌లాక్ సీన్లు కామన్ అయిపోయాయి. అయితే అవి శృతి మించిపోతున్నాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. లేటెస్ట్‌గా ఓ సినిమా షూటింగ్‌లో లిప్ లాక్ సీన్ ఘాటు ఎక్కువ అవ్వడంతో డైరెక్టర్ మీద కోపంతో హీరోయిన్ షూటింగ్ నుంచి వెళ్లిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. సాట్ సినిమాస్ పతాకంపై రూపొందిన తమిళ సినిమా ఉట్రాన్. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో హిరోషిణి హీరోయిన్‌గా నటించింది. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పాపులర్ అయిన హిరోషిణి హీరోయిన్‌గా ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతుంది. రాజా గజనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లిప్‌లాక్ సన్నివేశం ఇప్పుడు కోలీవుడ్‌లో వివాదంగా మారింది.
అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశం ఉన్నట్లు దర్శకుడు ముందే హీరోయిన్‌కు చెప్పాడు. అయితే అందుకు అంగీకరించింది హీరోయిన్. అయితే తీరా సన్నివేశం షూటింగ్‌లో మాత్రం హీరో లిప్‌లాక్ కాకుండా స్మూచ్ చెయ్యడంతో హీరోయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే హీరోయిన్ చెప్పింది దర్శకుడికి అర్థంగాక అయోమయంలో పడడంతో హీరోయిన్ తనే ముద్దు గురించి వివరించింది. లిప్‌లాక్ అంటే పెదాలపై చుంభించడం అనీ, స్మూచ్ అంటే పెదాలను దాటి నాలుకను చప్పరించడం అనీ, హీరో అదే చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసి షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయి కార్‌వాన్‌లో కూర్చుంది. అయితే రెండవసారి కూడా అలాగే చెయ్యడంతో హీరోయిన్ పూర్తిగా షూటింగ్ నుంచి వెళ్లిపోయింది.