లైఫ్ ఇచ్చిన అభిమానులకు ఆపద వస్తే ముందుకొస్తున్నారు..

స్టార్ హీరోలు తమ ఫ్యాన్స్ కోసం రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మేమున్నాం.. అంటూ నిలబడుతున్నారు..

  • Published By: sekhar ,Published On : February 11, 2020 / 07:02 AM IST
లైఫ్ ఇచ్చిన అభిమానులకు ఆపద వస్తే ముందుకొస్తున్నారు..

Updated On : February 11, 2020 / 7:02 AM IST

స్టార్ హీరోలు తమ ఫ్యాన్స్ కోసం రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మేమున్నాం.. అంటూ నిలబడుతున్నారు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమాని కుటుంబానికి  రూ.10 లక్షల చెక్ ఇచ్చాడు. తమిళస్టార్ హీరో సూర్య.. తన అభిమాని కోసం అందరి ముందూ ఏడ్చేశాడు. అప్పటి వరకూ ఏ సినిమా ఫంక్షన్‌కూ వెళ్లని తన ఫ్యాన్‌ని విజయ్ దేవరకొండ ఏకంగా ఫిల్మ్ ఫేర్‌కు తీసుకెళ్లాడు. ఇలా స్టార్ హీరోలు తమ ఫ్యాన్స్ కోసం రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మేమున్నాం.. అంటూ నిలబడుతున్నారు. తమకు లైఫ్ ఇచ్చిన అభిమానులకు సాయం చేస్తున్నారు. 

తామంటే ప్రాణం పెట్టే ఫ్యాన్స్ కోసం చిన్న హీరోల దగ్గరినుంచి స్టార్ హీరోల వరకూ  కదిలి వెళుతున్నారు. తమకు చేతనైన సాయం చేస్తున్నారు. మెగాఫ్యామిలీకి వీరాభిమాని అయిన నూర్ మహ్మద్ ఇటీవల హార్ట్ ఎటాక్‌తో చనిపోతే.. చిరంజీవి వాళ్ల ఇంటికెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించాడు. రీసెంట్‌గా రామ్ చరణ్ వాళ్ల ఫ్యామిలీకి నేనున్నానంటూ ధైర్యం చెప్పి, రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.

RC

తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా అంతే. తమ అభిమానుల కోసం ఏకంగా ఓ ఆర్గనైజేషన్ పెట్టాడు. ఈ సంస్థ ద్వారా సహాయం పొందిన ఓ అభిమాని.. తనకు సూర్య అంటే ఎంత ఇష్టమో.. జీవితంలో సూర్య ఎంత హెల్ప్ చేశాడో చెప్తూ స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంటే.. సూర్య.. ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని అంతకు మించి ఏడ్చేశాడు.. ఆ దృశ్యం చూసేవాళ్ల చేత కూడా కంటతడి పెట్టించింది.

SURIYA

టాలీవుడ్ క్రేజియెస్ట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన అభిమానులను ఎప్పటి కప్పుడు సర్‌‌ప్రైజ్ చేస్తుంటాడు. తనకు తోచిన సహాయం చేస్తుంటాడు. రెండేళ్ల క్రితం తన అభిమానికి స్వయంగా వెళ్లి టికెట్స్ ఇచ్చాడు. ఇంకోసారి మరో అభిమానికి.. సేమ్ తను వేసుకున్న రౌడీ సూట్ కుట్టించి.. ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోడానికి తనతో పాటు తీసుకెళ్లాడు. మరోసారి స్టార్ హీరోల కిడ్స్ అందరికీ తనింట్లో పార్టీ ఇచ్చి, వాళ్లతో రౌడీ వేర్ వేయించి సందడి చేశాడు. ‘డియర్ కామ్రేడ్’ సినిమాకి హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ కౌంటర్‌లో కూర్చుని టికెట్స్ అమ్మాడు. ఇటీవలే శాంటాగా మారి తన అభిమానికి తమ్ముడు ఆనంద్ చేత మ్యాక్ బుక్ ప్రో పంపించి ఆశ్చర్య పరిచాడు.

VD

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్.. కూడా తమను ప్రేమించే అభిమానులకోసం ఎప్పుడూ ముందే ఉంటారు. తమను చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం వాళ్లను కలుసుకుని టైమ్ స్పెండ్ చేస్తారు. ఎన్టీఆర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పాప దగ్గరకి వెళ్లాడు. అంతకుముందు తన వీరాభిమాని అయిన నాగార్జునను కలవడానికి వెళ్లి అతని కోరిక తీర్చాడు. ఇలా చాలా మంది హీరోలు తమ అభిమానుల కోసం సాయం చెయ్యడానికి ముందుంటున్నారు.