Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జూడ్’..
ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’..
Hey Jude: తెలుగు ప్రజల అరచేతిలోకి వినోదాన్ని, తెలుగు వారికి అంతులేని అమితానందాన్ని అందిస్తూ డిజిటల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.
బ్లాక్‌బస్టర్ మూవీస్, అదిరిపోయే టాక్ షోస్, థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌తో మరో ఓటీటీ కూడా ఇవ్వలేని ఎండ్ లెస్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది.
Aha : ‘ఆహా’లో తెలుగు ‘ఇండియన్ ఐడిల్’కి విశేష స్పందన!..
‘ది అమెరికన్ డ్రీమ్’, ‘లక్ష్య’, ‘సేనాపతి’, ‘త్రీ రోజెస్’, ‘లాభం’, ‘మంచి రోజులు వచ్చాయి’, ‘రొమాంటిక్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘అనుభవించు రాజా’, ‘సర్కార్’, ‘చెఫ్ మంత్ర’, ‘అ్లల్లుడు గారు’, ‘క్రిస్మస్ తాత’.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు, షోస్‌తో పాటు ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ (దక్షిణాదిలో నిర్వహిస్తున్న ఇండియన్ ఐడిల్).. త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం కానుంది. అలాగే ‘ఆహా’లో ప్రేక్షకులను మెప్పిస్తున్న బాలకృష్ణ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (ఈ టాక్ షోను 9.7 రేటింగ్‌తో ఐఎండీబీ నెంబర్ వన్ షోగా గుర్తించింది) ప్రేక్షకులను అలరిస్తోంది.
Balakrishna : బాలయ్య ‘మంగళవారం మెనూ’ మామూలుగా లేదుగా!
అలాగే ప్రియమణి ప్రధాన పాత్రలో థ్రిల్లింగ్ ఫిలిం ‘భామా కలాపం’ కూడా త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’. మలయాళంలో ఘనవిజయాన్ని సాధించిన ఎన్నో మూవీస్ ‘ఆహా’ వ్యూవర్స్‌ని చాలా బాగా ఆకట్టుకున్నాయి.
Bhama Kalapam : ‘ఆహా’ లో మరో అదిరిపోయే థ్రిల్లర్..
ఇప్పుడు మలయాళ యంగ్ స్టార్ హీరో నివీన్ పౌలి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ‘హే జూడ్’ ‘ఆహా’ లో ప్రీమియర్ కానుంది. శ్యామ్ ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మలయాళంలో మంచి విజయం సాధించింది. జనవరి 21 నుండి ‘హే జూడ్’ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.