Hidimbha Reverse Action Trailer : ఇదేం ట్రైలర్ రా బాబు.. అంతా రివర్సే.. క్యూరియాసిటీ క్రియేట్ చేసిన హిడింబ రివర్స్ యాక్షన్ ట్రైలర్
ఓంకార్ తమ్ముడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అశ్విన్ బాబు(Ashwin Babu). తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం హిడింబ.

Hidimba reverse action trailer
Hidimbha : ఓంకార్ తమ్ముడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అశ్విన్ బాబు(Ashwin Babu). తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం హిడింబ. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో నందితా శ్వేత (Nandita Swetha) కథానాయికగా నటిస్తోంది. వికాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా రివర్స్ యాక్షన్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ఫోటో లీక్ చేసిన పవన్..! థాంక్స్ చెప్పిన నిధి అగర్వాల్
ఈ ట్రైలర్ స్పెషల్ ఏంటంటే..? అంతా రివర్స్‌లోనే ఉంది. వెనక్కి నడవడం, వెనక్కి పరుగెత్తడం ఇలా ప్రతి షాట్‌ను రివర్స్ చేస్తూ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒక్క డైలాగు కూడా లేకుండా సాగింది. ప్రతి సన్నివేశానికి తగినట్లు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంటెన్స్ మ్యూజిక్ బాగుంది. ఇక ట్రైలర్ ఆఖర్లో రక్తపు బొట్టు వెనక్కి వెళ్లే సీన్ హైలెట్‌గా చెప్పవచ్చు. ఈ రివర్స్ యాక్షన్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచేసింది.
Vishnu Vishal : కమెడియన్‌తో వివాదం.. స్పందించిన హీరో.. రూ.2.7 కోట్లు తిరిగి ఇవ్వలేనా..?
అనిల్ కన్నెగంటి గతంలో మంచు మనోజ్‌తో ‘మిస్టర్ నూకయ్య’, సందీప్ కిషన్‌తో ‘రన్’, కళ్యాణ్ రామ్‌తో ‘అసాధ్యుడు’ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో నరమాంస భక్షకులకి స్టోరీని లింక్ చేసి సరికొత్త పాయింట్‌ని ఈ మూవీలో అనిల్ కన్నెగంటి చూపించబోతున్నారు. సీరియల్ కిడ్నాప్స్ చేధించేందుకు రంగంలోకి దిగే పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్‌గా అశ్విన్ బాబు కనిపించనున్నారు.