సైలెన్స్ : చెవిటి, మూగ పాత్రలో అనుష్క

‘భాగమతి’తో భారీ విజయాన్ని అందుకున్న అనుష్క.. నెక్ట్స్ మూవీపై దృష్టి పెట్టింది. రెగ్యులర్ జోనర్ జోలికి వెళ్లకుండా వైవిధ్యం కోసం ప్రయత్నిస్తోంది. చేసే సినిమాలు తక్కువే అయినా.. జీవితాంతం గుర్తుండిపోయే కథలను సెలక్ట్ చేసుకుంటోంది స్వీటీ. ఈసారి ఆ ఛాన్స్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ కు ఇచ్చింది.
చెవిటి, మూగ పాత్రలో అనుష్క :
మొన్ననే దెయ్యంగా భయపెట్టిన అనుష్క.. ఈసారి చెవిటి, మూగ పాత్రలో కనిపించబోతున్నది. ఎంతో ఛాలెంజ్ గా తీసుకుని.. అలాంటి వ్యక్తులను చూసి, వారికి ట్రీట్ మెంట్ ఇచ్చే వైద్యుల నుంచి వివరాలు తెలుసుకుంటుంది. చెవిటి, మూగ వారు ఎలా ఉంటారు.. ఇతరులకు వారి ఎలా కమ్యూనికేట్ చేస్తారు.. వారిలోని లోపాలను అధిగమించి ఎలా జీవిస్తున్నారు.. సమాజం నుంచి ఎలాంటి సహకారం ఉంది ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకుంటుంది అనుష్క. పాత్రలో నటించటం కాదు.. జీవించాలనే తపనతో ఉందంట ఈ భాగమతి. మధుకర్ అందించిన కథ హారర్ థ్రిల్లర్ గా ఉంటుందంట. అనుష్కతోపాటు అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారంట. ఈ మూవీకి సైలెన్స్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సినీ ఇండస్ట్రీ టాక్.
హాలివుడ్ స్టార్ కూడా :
ఈ మూవీలో హాలివుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. అనేక ఇంగ్లీష్ మూవీస్ లో నటించిన మైఖేల్ ఈ సినిమాలో నటించటానికి ఒప్పుకోవటం గ్రేట్ అంటోంది సినీ ఇండస్ట్రీ. ఇందులో ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అగ్రిమెంట్ కూడా జరిగిందంట. సైలెన్స్ మూవీ మేకింగ్ అంతా అమెరికాలో జరగనుందని.. అందుకు తగ్గట్టుగానే హాలివుడ్ స్టార్స్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. కథ ఫైనల్ అయ్యిందని.. త్వరలోనే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఓ తెలుగు మూవీలో హాలీవుడ్ స్టార్స్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ అప్పుడే క్రేజ్ మొదలైపోయింది. అనుష్క మరోసారి తన నట విశ్వరూపాన్ని తెర చూడటానికి అభిమానులు కూడా సిద్ధం అయిపోయారు.