War 2 : హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ షురూ.. లీకైన ఫోటోలు వైరల్..

హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 మొదటి షెడ్యూల్ మొదలైంది. స్పెయిన్ లో ఒక సూపర్ కారు ఛేజింగ్ సీక్వెన్స్..

War 2 : హృతిక్, ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ షురూ.. లీకైన ఫోటోలు వైరల్..

Hrithik Roshan NTR war 2 shooting starts at spain

Updated On : October 18, 2023 / 3:59 PM IST

War 2 : ఇండియన్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించబోతున్న సినిమా ‘వార్ 2’. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘వార్’కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో అని నందమూరి అభిమానులంతా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కూడా కలిశాడు. తాజాగా ఈ దర్శకుడు వార్ 2 మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టేశాడు.

యాక్షన్ షెడ్యూల్ తో ఈ మూవీ మొదటి షెడ్యూల్ మొదలైంది. స్పెయిన్ లో ఒక సూపర్ కారు ఛేజింగ్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఆ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట లీక్ అయ్యి వైరల్ గా మారాయి. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లేకుండానే జరుగుతుంది. వీరిద్దరూ లేని సీన్స్ ని దర్శకుడు ప్రస్తుతం స్పెయిన్ లో తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే హృతిక్ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు అని సమాచారం. మరి ఎన్టీఆర్ ఎప్పుడు వార్ 2 లోకి అడుగు పెడతాడో తెలియాల్సి ఉంది.

Also read : Leo Movie : ‘లియో’ గురించి బిగ్ హింట్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. అదేంటో తెలిస్తే థ్రిల్ అవుతారు..

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండడంతో.. మూవీ షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే NTR31 షూటింగ్ ని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో స్టార్ట్ చేయనున్నట్లు ఇటీవల ప్రొడ్యూసర్స్ తెలియజేశారు. మరి ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ వార్ 2 కి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తాడో చూడాలి. ఇక దేవర రెండు పార్టులు, వార్ 2, NTR31 సినిమాల లైనప్ తో అభిమానులకు ఎన్టీఆర్ ఫుల్ కిక్ ఇస్తున్నాడు.