Kumari Aunty : బిగ్‌బాస్ వేదిక పైకి వచ్చేసిన కుమారి ఆంటీ.. అందరికీ నాన్‌వెజ్ భోజనంతో..
సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యిన కుమారి ఆంటీ.. బిగ్‌బాస్ వేదిక పైకి అందరికీ నాన్‌వెజ్ భోజనం పెట్టి సందడి చేశారు.

hyderabad Food Stall seller Kumari Aunty at biggboss stage
Kumari Aunty : ఒకప్పుడు వెండితెర మీదనే కాదు బుల్లితెర పై కనిపించాలన్నా.. ఏదొక టాలెంట్ ని నిరూపించుకోవాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు టాలెంట్ ఉండనవసరం లేదు, ఫేమ్ లభిస్తే చాలు స్క్రీన్ పై కనిపించేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల కుమారి ఆంటీ అనే ఒక ఫుడ్ స్టాల్ వ్యాపారి.. సోషల్ మీడియా స్టార్ అయ్యిపోయారు. అంతేకాదు ఈమె గురించి ఒక రాష్ట్ర సీఎం ప్రత్యేకంగా మాట్లాడడం విశేషం.
దీంతో కుమారి ఆంటీ అనే పేరు.. సోషల్ మీడియా అండ్ మీడియాలో ప్రస్తుతం చాలా పెద్ద టాపిక్ అయ్యింది. ఇక ఈమె పేరు ఇంతలా వైరల్ అవుతుండడంతో.. త్వరలోనే ఏదొక టీవీ షోలో పాల్గొనడం పక్కా అంటూ పలువురు కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ అంచనాలు నిజమయ్యాయి. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కి సంబంధించిన ఈవెంట్ లో కుమారి ఆంటీ సందడి చేశారు.
Also read : Mrunal Thakur : అవార్డుల వేడుకలో మృణాల్‌కి చేదు అనుభవం.. నెపోటిజంపై వైరల్ కామెంట్స్..
ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 7 పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ చాలా హోరాహోరీగానే జరిగింది. ఇక ఈ సీజన్ కంటెస్టెంట్స్ తో అందరితో బిగ్‌బాస్ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని షో నిర్వాహకులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇక ఆ షోకి కుమారి ఆంటీని గెస్ట్ గా తీసుకు వచ్చారు. బిగ్‌బాస్ వేదిక మీదకి వచ్చిన కుమారి ఆంటీ.. అక్కడ కూడా తన చేతి రుచిని అందరికి చూపించారు. నాన్‌వెజ్ భోజనంతో అందరితో ఆహా అనిపించినట్లు తెలుస్తుంది.
#BBUtsavam షో లో #KumariAunty !
అందరికీ NonVeg భోజనం కూడా… pic.twitter.com/SfmCzFSjOd
— Rajesh Manne (@rajeshmanne1) February 6, 2024
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన ఆడియన్స్.. త్వరలోనే మిగిలిన టీవీ ఛానల్స్ లో కూడా కుమారి ఆంటీ కనిపించడం ఖాయం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు.. ‘వచ్చే బిగ్‌బాస్ సీజన్ లో ఈ ఆంటీ కంటెస్టెంట్ గా కనిపించినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు’ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.