శభాష్ చిరు.. మెగాస్టార్ ఊరికే అవలేదు మరి!..
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వూలో గర్వం తలకెక్కకుండా ఉండడానికి ఆయన ఏం చేస్తారో చెప్పారు..

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వూలో గర్వం తలకెక్కకుండా ఉండడానికి ఆయన ఏం చేస్తారో చెప్పారు..
స్టార్ స్టార్.. మెగాస్టార్.. స్టార్ స్టార్.. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్.. తెలుగు సినిమా సింహాసనంపై ఏకంగా మూడు దశాబ్దాలపాటు ఆసీనుడైన చిరంజీవి తన తర్వాత వచ్చిన ఎందరో హీరోలకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవల చిరు చెప్పిన ఓ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో చిరంజీవి.. పలు సినిమా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా (సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు హోదాలో) హాజరవుతున్నారు. ప్రతీ ఫంక్షన్‌లోనూ అందరూ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీటిని ఎలా స్వీకరిస్తారనే అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్పందించారు.
‘‘ఎవరైనా పొగిడితే పొంగిపోను. గర్వం రాకుండా ఉండేందుకు ఇంటికి వెళ్లి నేలపై పడుకుంటా. ఎవరైనా ప్రశంసిస్తే అది నా గొప్పతనం కాదు. సినిమా హిట్టు, ఫ్లాపు వెనుక చిత్రయూనిట్ కష్టం ఉంటుంది. ఒకవేళ విమర్శించినట్లైతే కనుక సమిష్టిగా ఫెయిల్ అయ్యామని అనుకుంటా. ఈ రెండింటిలో నిజాయితీగా ఉంటా. హిట్లు, ఫ్లాపులను ఒకేలా తీసుకుంటాం’’ అంటూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ముఖ్యం అనే విషయాన్ని ఈ తరం వారికి తెలిపారు.
చిరు ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ పెడుతున్నట్లు ఇటీవల ఓ కార్యక్రమంలో చిరంజీవే ప్రకటించారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఉగాది కానుకగా టైటిల్ లోగో రిలీజ్ కానుంది..