Rashmika Mandanna : మొన్న బాలకృష్ణ, ఇవాళ శుబ్మాన్ గిల్.. రష్మిక ఫాలోయింగ్ మాములుగా లేదుగా!
ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా రష్మిక మందన్న ఫాలోయింగ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటూ నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది. సెలెబ్రెటీస్ కూడా ఈ అమ్మడికి ఫిదా అయిపోతున్నారు. ఇటీవల బాలకృష్ణ..
Rashmika Mandanna : ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా రష్మిక మందన్న ఫాలోయింగ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటూ నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది. సెలెబ్రెటీస్ కూడా ఈ అమ్మడికి ఫిదా అయిపోతున్నారు. ఇటీవల బాలకృష్ణ తన అన్‌స్టాపబుల్ షోలో తన క్రష్ రష్మిక మందన్న అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో సెలెబ్రెటీ వచ్చాడు. ఇండియన్ క్రికెట్ ప్లేయర్ శుబ్మాన్ గిల్ కూడా రష్మిక మాయలో పడిపోయాడట. కాగా గిల్ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంటుంది.
Rashmika Mandanna : ఉర్ఫీ జావేద్‌ని ఫాలో అవుతున్న రష్మిక.. బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజెన్లు కామెంట్లు!
ఈ హ్యాండ్సమ్ క్రికెటర్.. సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ సోషల్ మీడియా చాలా పోస్టులే కనబడుతుంటాయి. ఇక ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తో కూడా ఈ క్రికెటర్ ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శుబ్మాన్ గిల్ ని మీ క్రష్ ఎవరంటూ ప్రశ్నించారు. దీనికి బదులివ్వడానికి ముందు సందేహించినా, చివరికి క్రష్ ఎవరో తెలియజేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంటే తనకి చాలా ఇస్తామంటూ, ఆమె తన క్రష్ అంటూ వెల్లడించాడు.
ఇక ఈ వ్యాఖ్యలు విన్న నెటిజెన్లు.. సారా టెండుల్కర్, సారా అలీఖాన్ ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు చెబుతావు అనుకుంటుంటే ఇలా ట్విస్ట్ ఇచ్చావు ఏంటి బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రష్మిక మందన్న అభిమానులు అయితే అది నేషనల్ క్రష్ రేంజ్ అంటే అంటున్నారు. కాగా ప్రస్తుతం రష్మిక నార్త్ టు సౌత్ వరుస సినిమాలు చేస్తుంది. హిందీలో రణ్‌బీర్ సరసన ‘యానిమల్’ సినిమాలో నటిస్తుండగా, తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్నాయి.