Innovative International Film Festival : ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో తెలుగు సినిమాలు.. బేబీ డైరెక్టర్ కి స్పెషల్ అవార్డు..
బెంగుళూరులో ఈ నెల అక్టోబర్ 12 నుండి 15 వరకు ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది.

Innovative International Film Festival Screening Some Telugu Films and Baby Director Sai Rajesh Awarded
Innovative International Film Festival : ఇటీవల తెలుగు సినిమాలు అన్ని చోట్ల మంచి ఆదరణ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వేదికపై తెలుగు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో పాటు పలు రికార్డులని, అవార్డుని అందుకుంటున్నాయి. తాజాగా బెంగుళూరులో(Bengaluru) ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుండగా తెలుగు నుంచి పలు సినిమాలు ఈ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అవ్వనున్నాయి. అలాగే పలు సినిమాలకు, దర్శకులకు, నటులకు అవార్డులు అందివ్వనున్నారు.
బెంగుళూరులో ఈ నెల అక్టోబర్ 12 నుండి 15 వరకు ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో తెలుగు నుంచి.. RRR, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, సీతారామం, బేబీ, అఖండ, కార్తికేయ 2, సినిమా బండి, మేజర్, బలగం సినిమాలు ప్రత్యేక స్క్రీనింగ్ వేయనున్నారు. అలాగే మిగిలిన భాషల నుంచి కూడా పలు సినిమాలు స్క్రీనింగ్ అవ్వనున్నాయి.
Also Read : Ekta Kapoor : నేను అడల్ట్ సినిమాలే చేస్తాను.. నెటిజన్ కి కౌంటర్ ఇచ్చిన లేడీ నిర్మాత..
ఇక తెలుగులో బేబీ(Baby) సినిమా దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh) కు ట్రెండింగ్ ఐకానిక్ డైరెక్టర్ అవార్డు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబుకి ట్రెండింగ్ డైరెక్టర్ అవార్డు ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్ కి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో డైరెక్టర్స్ సాయి రాజేష్, మహేష్ బాబులకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
#MissShettyMrPolishetty Director @filmymahesh is being honored with the "Trending Director" award at the Innovative International Film Festival ?
??????? ??????????? ?? ??? ???? Now Streaming on #Netflix#BlockbusterMSMP @UV_Creations… pic.twitter.com/YjVg0m1Sz3
— Eluru Sreenu (@IamEluruSreenu) October 11, 2023
#BlockbusterBaby Rampage Continues!!!
Director #SaiRajesh wins
Trending Iconic Director Award – Innovative International Film Festival for #BabyTheMovie ❤️?Producer @SKNonline joins the prestigious event as a special invitee for an insightful special conversation ? pic.twitter.com/7wiENekEco
— Vamsi Kaka (@vamsikaka) October 11, 2023