Inti Number 13 : దెయ్యంతో ఐటెం సాంగ్.. ఓరి నాయనో.. ఓరి దేవుడో.. ఇదేం సాంగ్ రా బాబు..
దెయ్యంతో ఐటెం సాంగ్ మీరు ఎప్పుడైనా చూసారా. ఆ ఐటెం సాంగ్ ని కూడా దెయ్యమే పాడితే ఇంకా థ్రిల్ ఉంటుంది కాదా..

Inti Number 13 movie Promotional Song released
Inti Number 13 : ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో హారర్ మూవీస్ తెగ సందడి చేస్తున్నాయి. హారర్ నేపథ్యంతో వస్తున్న సినిమాలు అన్ని దాదాపు మంచి విజయాలను అందుకుంటున్నాయి. తాజాగా ఇప్పుడు అదే హిట్ ఫార్ములాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న చిత్రం ‘ఇంటి నెం.13’. డిఫరెంట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా పన్నా రాయల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసాయి. తాజాగా ఈ సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘నా ఇంటి నెంబరు 13’ అంటూ దెయ్యం పాడే పాట ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. దెయ్యం ఐటెం సాంగ్ పాడడం అనేది ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుంది. ఇక ఈ పాటని రాజలక్ష్మీ పాడారు. ఈమె ‘పుష్ప’ సూపర్ హిట్ సాంగ్ ‘సామీ’ తమిళ్ వెర్షన్‌ని పాడి అదుర్స్ అనిపించుకున్నారు.
Also read : MixUp Teaser : వామ్మో ఆహా నుంచి ఇంత బోల్డ్ కంటెంట్..? టీజర్‌లోనే ఇంతుందంటే..
ఇప్పుడు ఈ పాటని కూడా అంతే హుషారుగా ఆలపించి మరోసారి అదుర్స్ అనిపించుకున్నారు. ఇక ఈ లిరికల్ వీడియోతో కొన్ని మేకింగ్ సీన్స్ అండ్ మూవీలోని సన్నివేశాలను కూడా చూపించి.. సినిమాని ఎలాంటి క్వాలిటీతో చేశారు అనేది చూపించారు. మరి దెయ్యం పాడిన ఆ ఐటెం సాంగ్ ని మీరుకూడా వినేయండి. వినోద్ యాజమాన్య ఈ సినిమాకి సంగీతం అందించారు.
కాగా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న పన్నా రాయల్.. గతంలో కాలింగ్‌బెల్, రాక్షసి చిత్రాలతో ఆడియన్స్‌ని థ్రిల్ చేశారు. ఇప్పుడు ‘ఇంటి నెం.13’తో కూడా అలాగే ఆకట్టుకుంటారని మూవీ టీం తెలియజేస్తుంది. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక చిత్రాన్ని మార్చి 1న గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నారు. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.