Peddi : పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ నుంచి ఆ ప‌దాన్ని తొల‌గిస్తారా?

పెద్ది (Peddi) సినిమాలో అదే పదం ఉంది కదా, దాని గురించి మాట్లాడారా అంటూ కొందరు కొత్త వివాదం మొదలుపెట్టారు.

Peddi : పెద్ది సినిమాలోని చికిరి సాంగ్ నుంచి ఆ ప‌దాన్ని తొల‌గిస్తారా?

Is that word will be remove from Ram Charan Peddi Chikiri Song

Updated On : December 27, 2025 / 8:52 PM IST

Peddi : ఇటీవల సామాన్లు అనే పదం వాడి నటుడు శివాజీ ఎంత పెద్ద వివాదంలో చిక్కుకున్నారో చెప్పక్కర్లేదు. ఆ గొడవ ఇంకా సద్దుమణగనే లేదు. చాలా మంది సినిమా సెలబ్రిటీలు శివాజీ కామెంట్స్‌పై విమర్శలు చేస్తుంటే, సోషల్ మీడియాలో మాత్రం శివాజీకి పుల్ సపోర్ట్ దక్కుతోంది.

శివాజీ అలా అంటే యాగీ చేసిన వాళ్లు పెద్ది సినిమాలో అదే పదం ఉంది కదా, దాని గురించి మాట్లాడారా అంటూ కొందరు కొత్త వివాదం మొదలుపెట్టారు. సామాన్లు అనే పదం పెద్ది సినిమాలోని ఓ సాంగ్‌ లిరిక్స్‌గా ఉండటంతో పెద్ద చర్చనే నడుస్తుంది.

Rajasaab : అసలు ఇదేం ప్లాన్ ‘రాజాసాబ్’.. ఇప్పుడు సడెన్ గా ఇన్ని రోజుల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి..?

పెద్ది సినిమాలో చికిరి చికిరి సాంగ్‌లో సరుకు సామాన్ అనే పదాన్ని రామ్‌చరణ్ హీరోయిన్ దగ్గర పాడటాన్ని బయటకు తీసి ఇది కరెక్టేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో పెద్ది సినిమాలో వాడిన ఆ పదాలపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీంతో సాంగ్‌లో ఉన్న సరుకు సామాన్ అనే పదాన్ని తొలగించబోతున్నారట.

లేకపోతే ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మ్యూట్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ లిరిక్ యూట్యుబ్, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటే.. రిలీజ్‌ అయ్యే సినిమా ఔట్‌పుట్‌లో మాత్రం సరుకు సామాన్ పదం ఉండదంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మూవీ టీమ్ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సిందే.