Ishq Re Release : నితిన్ ‘ఇష్క్’ మూవీ ఫ్యాన్స్ ఉన్నారా.. అయితే వాళ్లకి ఒక అప్డేట్!
నితిన్ (Nithiin) కెరీర్ లో మంచి హిట్ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. కానీ వాటిలో ఇష్క్ (Ishq) సినిమా స్థానం వేరు. ఆల్మోస్ట్ 12 ప్లాప్ లు తరువాత ఈ సినిమా నితిన్ కి హిట్ అందించింది. దీంతో ఈ సినిమాని నితిన్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు.

Ishq Re Release on the occasion of nithiin birthday
Ishq Re Release : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం వక్కంతం వంశీ సినిమాలో నటిస్తున్నాడు. తన కెరీర్ లో 32వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో నితిన్ రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. మారేడుమిల్లి అడివి బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ ఉండనుంది. ఇక ఇటీవలే మరో కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేశాడు. భీష్మ (Bheeshma) సినిమాతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న నితిన్, రష్మిక, వెంకీ కుడుముల మరోసారి చేతులు కలపబోతున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ నెల 30న నితిన్ పుట్టినరోజు ఉంది. దీంతో తన సూపర్ హిట్ సినిమా ఇష్క్ (Ishq) రీ రిలీజ్ కి సిద్దమవుతుంది.
VNRTrio : చిరంజీవి చేతులు మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయిన నితిన్ కొత్త సినిమా..
నితిన్ కెరీర్ విషయానికి వస్తే.. హిట్టులు తక్కువ, ప్లాప్ లు ఎక్కువ. కెరీర్ లో 5వ సినిమాగా రాజమౌళితో కలిసి ‘సై’ సినిమా చేశాడు. ఆ మూవీ తరువాత ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ 12 ప్లాప్ లు చూశాడు. అయితే ఈ ప్లాప్ అయిన సినిమాలు అన్ని మాస్ మసాలా సినిమాలే. ఇక హిట్ కోసం తనకి కలిసొచ్చిన లవ్ స్టోరీ ‘ఇష్క్’తో 2012 లో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సూపర్ హిట్ అయ్యింది. నితిన్ కెరీర్ కి కొంచెం బూస్ట్ ఇచ్చింది.
Nithiin: ‘సైతాన్’గా మారుతున్న నితిన్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
ఈ సినిమాలో నితిన్, నిత్యామీనన్ (Nithya Menen), అజయ్ లీడ్ రోల్స్ చేశాడు. నితిన్ అండ్ నిత్యామీనన్ మధ్య కెమిస్ట్రీ అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇక అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. నంది అవార్డుని కూడా అందుకుంది ఈ సినిమా. అంతటి హిట్ అయిన ఈ మూవీని.. నితిన్ బర్త్ డే సందర్భంగా మార్చి 29న రీ రిలీజ్ చేయబోతున్నారు. నితిన్ ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లంతా థియేటర్ కి వెళ్లి ఆ ఇష్క్ ఫీల్ ని ఇంకోసారి అనుభవించేయండి.

Ishq Re Release on the occasion of nithiin birthday