Mythri Movie Makers : పుష్ప 2 సినిమాపై IT రైడ్ ఎఫెక్ట్ పడనుందా?
గత సంవత్సరం చివర్లో పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు ఈ సంవత్సరం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రి నిర్మాణ సంస్థ. అంతేకాదు మైత్రి మూవీస్ ప్రస్తుతం ఖుషి, ఉస్తాద్ భగత్ సింగ్, యన్టీఆర్ 31, RC 16 లాంటి భారీ బడ్జెట్ సినిమాలని లైన్లో పెట్టింది.

IT Raids on Mythri Movie Makers effect on Pushpa 2 Movie
Mythri Movie Makers : టాలీవుడ్ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ల మీద, సుకుమార్ ఇంటి మీద కూడా మంగళవారం(ఏప్రిల్ 19) ఐటీ రైడ్స్ జరగడంతో అసలేం జరుగుతోంది అంటూ వర్రీ అయ్యారు జనాలు. నేడు కూడా ఈ IT రైడ్స్ కంటిన్యూ అవ్వడంతో మరింత టెన్షన్ పడుతున్నారు టాలీవుడ్ జనాలు. గత సంవత్సరం చివర్లో పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు ఈ సంవత్సరం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రి నిర్మాణ సంస్థ. అంతేకాదు మైత్రి మూవీస్ ప్రస్తుతం ఖుషి, ఉస్తాద్ భగత్ సింగ్, యన్టీఆర్ 31, RC 16 లాంటి భారీ బడ్జెట్ సినిమాలని లైన్లో పెట్టింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా వస్తున్న పుష్ప 2 మరో ఎత్తు. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ లతో ఈ సినిమాలను తెరకెక్కిస్తున్న మైత్రి ఆఫీస్ మీద రైడ్స్ అవ్వడంతో టాలీవుడ్ లో హాట్ డిస్కషన్స్ కి దారితీసింది.
దాదాపు 1000 కోట్లకు పైగా ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న మైత్రి మూవీస్ మీద రైడ్లు కొనసాగితే భవిష్యత్ లో తెరకెక్కబోయే సినిమాల పరిస్థితి ఏంటని అంటూ వర్రీ అవుతున్నారు ఫాన్స్. అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ ఇటీవల నిర్మాతగా మారడంతో ఆయన ఇంటి మీద కూడా రైడ్స్ జరగడంతో పుష్ప సినిమా మీద ఆ ప్రభావం పడుతుందా అన్న చర్చ హాట్ టాపిక్ అయ్యింది. అసలే పుష్ప 2 డిలే అవుతూ వస్తున్నా ఈమధ్యే కాస్త స్పీడప్ అయ్యిందని ఆనందపడుతున్నారు ఫాన్స్. అలాంటి టైమ్ లో రైడ్స్ జరగడంతో ఏం జరుగుతుందో తెలీని అయోమయంలో పడిపోయారు బన్నీ ఫ్యాన్స్.
Pushpa : సినిమాలో అలా చూపించడం బాధాకరం.. పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐజి..
ఒక వైపు టాప్ సినిమాలు చేస్తున్న స్టార్ ప్రొడక్షన్ హౌజ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల సినిమాల్ని గ్రాండ్ గా స్టార్ట్ చేసి షూటింగ్ జరుపుకుంటున్న టైమ్ లో రైడ్స్ జరగడంతో ప్రజెంట్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇవాళ రెండో రోజు కూడా రైడ్స్ జరగడంతో ఫ్యాన్స్, టాలీవుడ్ జనాలు మరింత ఆందోళన చెందుతున్నారు. అందించిన లెక్కలు, బ్యాంకు లావాదేవీల మధ్య వ్యత్యాసం ఉన్నట్టు, జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డట్టు, మనీ లాండరింగ్ పాల్పడ్డట్టు అధికారులు ఆరోపణలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమని రుజువైతే మైత్రి సంస్థ పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు.