Gouri Kishan : ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న ’96’ జాను.. వైరల్ అవుతున్న ఫొటో..
చిన్నప్పటి జాను క్యారెక్టర్ లో గౌరి ప్రేక్షకులని మెప్పించింది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన గౌరి ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.

Jaanu Movie fame Gouri Kishan takes rib tattoo photo goes viral
Gouri Kishan Tattoo : తమిళ్ లో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), త్రిష(Trisha) జంటగా వచ్చిన 96 సినిమా మంచి విజయం సాధించి క్లాసిక్ హిట్ గా నిలిచింది. అదే సినిమాని ఇక్కడ శర్వానంద్(Sharwanand), సమంత(Samantha)లతో జాను(Jaanu) అని తీయగా ఇక్కడ కూడా పర్వాలేదనిపించింది. ఈ రెండు సినిమాలలో హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్స్ చేసింది గౌరి కిషన్. చిన్నప్పటి జాను క్యారెక్టర్ లో గౌరి ప్రేక్షకులని మెప్పించింది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన గౌరి ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.
గౌరి కిషన్ ఆల్రెడీ తెలుగులో సంతోష్ శోభన్ సరసన శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాతో హీరోయిన్ గా కూడా చేసింది. ప్రస్తుతం పలు తమిళ్, మలయాళం సినిమాలు చేస్తుంది. తాజాగా గౌరి వార్తల్లో నిలిచింది. ఇటీవల తాను టాటూ వేయించుకుంటున్నాను అని ప్రకటించింది. తాజాగా తన టాటూని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
గౌరీ తన టాటూని రైట్ సైడ్ నడుము పై భాగంలో చేయి కింద నుంచి ప్రైవేట్ పార్ట్స్ వరకు ఉండేలా వేయించుకుంది. దీనిని రిబ్ టాటూ అంటారు. ఇక ఈ టాటూని ఫొటో తీసి పెట్టగా ఇది వైరల్ గా మారింది. తన టాటూ పూర్తిగా కనిపించేలా పోస్ట్ చేయడంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. పలువురు టాటూని ఆ ప్లేస్ లో వేసుకున్నందుకు విమర్శిస్తుండగా మరికొందరు మాత్రం సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు.