Rohini : పది గంటలు సర్జరీ.. నటి రోహిణి కాలులోంచి రాడ్ బయటకు తీసిన డాక్టర్లు.. రెండు నెలలు బెడ్ రెస్ట్..

గతంలో తనకు యాక్సిడెంట్ అయిందని, అప్పుడు కాలిలో ఎముకకు సపోర్ట్ గా ఓ రాడ్ వేశారని, ఇప్పుడు డ్యాన్సులు చేస్తుంటే అది నొప్పిగా ఉండటంతో తీయించుకుందామని వెళ్తే ఆపరేషన్ చేసి రాడ్ తీయడం కుదరదని, లోపలే ఇరుక్కుపోయింది అని డాక్టర్లు చెప్పారంటూ ఇటీవల రోహిణి ఓ వీడియోలో తెలిపింది.

Rohini : పది గంటలు సర్జరీ.. నటి రోహిణి కాలులోంచి రాడ్ బయటకు తీసిన డాక్టర్లు.. రెండు నెలలు బెడ్ రెస్ట్..

Jabardasth Rohini take a surgery for leg doctors said 2 months bed rest need

Updated On : May 18, 2023 / 7:58 AM IST

Jabardasth Rohini : నటి రోహిణి సీరియల్స్(Serials) తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత బిగ్ బాస్(BiggBoss) తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ అనంతరం టీవీ షోలు, సిరీస్ లు, సినిమాలు, జబర్దస్త్.. ఇలా వరుస అవకాశాలు వచ్చాయి. జబర్దస్త్ షోలో మెప్పించి సినిమాల్లో లేడీ కమెడియన్ గా కూడా ఛాన్సులు సంపాదిస్తోంది రోహిణి. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో హాస్పిటల్(Hospital) లో చేరింది రోహిణి.

గతంలో తనకు యాక్సిడెంట్ అయిందని, అప్పుడు కాలిలో ఎముకకు సపోర్ట్ గా ఓ రాడ్ వేశారని, ఇప్పుడు డ్యాన్సులు చేస్తుంటే అది నొప్పిగా ఉండటంతో తీయించుకుందామని వెళ్తే ఆపరేషన్ చేసి రాడ్ తీయడం కుదరదని, లోపలే ఇరుక్కుపోయింది అని డాక్టర్లు చెప్పారంటూ ఇటీవల రోహిణి ఓ వీడియోలో తెలిపింది. ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసి చాలా బాధగా ఉందని ఎమోషనల్ అయింది. అయితే డాక్టర్లు రాడ్ రాదని చెప్పినా తాను ఎలాగైనా రాడ్ తీయించుకోవాలని తనకు మొదటిసారి ఆపరేషన్ చేసిన డాక్టర్ వద్దకు వెళ్ళింది.

Cannes 2023 : ఈ సారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుస్తున్న ఇండియన్ తారలు.. ఫస్ట్ టైం ఎవరెవరో తెలుసా?

తాజాగా మరో వీడియోని రిలీజ్ చేసింది రోహిణి. ఈ వీడియోలో హాస్పిటల్ బెడ్ పై నుంచే మాట్లాడుతూ.. గంటలో సర్జరీ చేస్తామన్నారు డాక్టర్లు. కానీ 10 గంటలు పట్టింది. డాక్టర్లు ఎంతో కష్టపడి నా కాలిలో ఇరుక్కుపోయిన రాడ్ ని తొలగించారు. ఇప్పుడు ఆరువారాల దాకా కాలు కింద పెట్టొద్దన్నారు. ఇప్పుడు నాకు బెడ్ రెస్ట్ తప్పదు. చాలా కుట్లు వేశారు. ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదు. చాలా నొప్పిగా ఉంది అంటూ ఏడ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ కాగా రోహిణి అభిమానులు, తోటి నటులు ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ఫాస్ట్ గా టీవీలోకి రావాలని కోరుకుంటున్నారు.