Jailer Movie Success : జైలర్ ప్రాఫిట్స్ నుంచి అపోలో హాస్పిటల్స్ కి చెక్.. 100 మంది పిల్లల్ని బతికించడానికి..

తాజాగా జైలర్ సక్సెస్ తో ఓ మంచి ని కూడా చేశారు. జైలర్ సినిమా సక్సెస్ అయినందుకు గాను ఒక కోటి రూపాయలను అపోలో హాస్పిటల్స్ కి అందించారు.

Jailer Movie Success : జైలర్ ప్రాఫిట్స్ నుంచి అపోలో హాస్పిటల్స్ కి చెక్.. 100 మంది పిల్లల్ని బతికించడానికి..

Jailer Movie Producers gave one crore rupees to apollo hospitals for 100 under privileged children heart surgery

Updated On : September 6, 2023 / 7:14 AM IST

Jailer Movie Success :  సూపర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) చాలా రోజుల తర్వాత ‘జైలర్’(Jailer) సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జైలర్ సినిమా ఆగ‌స్టు 10న రిలీజ్ అయి భారీ విజయం సాధించి ఇప్పటికే దాదాపు 650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. జైలర్ సినిమా భారీ విజయం అందుకోవడంతో చిత్ర నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

జైలర్ సినిమా సక్సెస్ తో నిర్మాత కళానిధి మారన్(Kalanithi Maran) ఇప్పటికే రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి కాస్ట్ లీ కార్లతో పాటు కొంత అమౌంట్స్ కూడా చెక్ రూపంలో అందించారు. అలాగే చిత్రయూనిట్ లోని మరికొంతమందికి కూడా గిఫ్ట్స్ ఇచ్చినట్టు సమాచారం.

Bigg Boss 7 Day 2 : బిగ్‌బాస్ సీజన్ 7 డే 2.. మొదటి వారం నామినేషన్స్ షురూ.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరు?

తాజాగా జైలర్ సక్సెస్ తో ఓ మంచి ని కూడా చేశారు. జైలర్ సినిమా సక్సెస్ అయినందుకు గాను ఒక కోటి రూపాయలను అపోలో హాస్పిటల్స్ కి అందించారు. దాదాపు 100 మంది చిన్నారులకు ఫ్రీగా గుండె ఆపరేషన్స్ చేయించడానికి ఈ డబ్బుని వినియోగించనున్నారు. జైలర్ చిత్రనిర్మాత కళానిధి మారన్ భార్య కావేరి కళానిధి స్వయంగా అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డికి కోటి రూపాయల చెక్ అందించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇలాంటి మంచి పని కూడా చేసినందుకు పలువురు అభినందిస్తున్నారు.