Avatar : అవతార్, కల్కి మధ్య ఉన్న కనెక్షన్ ఇదే.. దర్శకుడు జేమ్స్ కామెరాన్ చెప్పిన మాటలు..

అవతార్ సినిమా హిందూ పురాణాలు ఆధారంగా దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించాడని మీలో ఎంతమందికి తెలుసు..? తెలియకపోతే ఇది చదివేయండి.

Avatar : అవతార్, కల్కి మధ్య ఉన్న కనెక్షన్ ఇదే.. దర్శకుడు జేమ్స్ కామెరాన్ చెప్పిన మాటలు..

James Cameron said Avatar movie is connected to Hindu religion and mythology

Updated On : August 5, 2023 / 4:22 PM IST

Avatar : హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన ‘అవతార్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెర పై పండోరా అనే గ్రహాన్ని జేమ్స్ కామెరాన్ అదిరిపోయే విజువల్స్ తో చూపించి ప్రతిఒకర్ని వావ్ అనిపించేలా చేశాడు. ఇటీవల పార్ట్ 2 (Avatar: The Way Of Water) కూడా ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కాగా అవతార్ 1 రిలీజ్ సమయంలో జేమ్స్ కామెరాన్ ఒక ఇండియన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియజేశాడు.

Suriya : బాలీవుడ్ దర్శకుడితో సూర్య 600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ.. టైటిల్ ‘కర్ణ’.. కర్ణుడి కథేనా..?

అవతార్ అనే టైటిల్ నుంచి సినిమాలోని అవతారుల వేషధారణ వరకు హిందూ పురాణాలకు దగ్గర సంబంధం కనిపిస్తుంది. అవతార్ అనేది సంస్కృత పదం అవతార నుండి వచ్చింది. హిందూమతంలో ఇది ఒక దేవుని అవతారంగా చెప్పబడుతుంది. ఇక హిందూ పురాణంలోని విష్ణువు, శివుడు, కృష్ణుడు, రాముడు.. ఇలా పలువురు దేవుళ్ళు నీలిరంగులో ఉంటారు. అవతార్ సినిమాలో కూడా అవతార్స్ ని నీలి రంగులోనే చూపించారు.

అలాగే మన పురాణంలో శంభల అనే ప్రదేశం ఒకటి ఉంటుందని, అక్కడ కల్కి అవతారం ఉద్భవిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు అక్కడి ప్రజలు దాదాపు 10 అడుగులు ఎత్తు ఉంటారని పేర్కొన్నారు. ఈ అన్ని విషయాలు సరిగ్గా గమనిస్తే అవతార్ సినిమాలో కామన్ గా కనిపిస్తాయి. దీంతో ఈ మూవీకి హిందూ పురాణాలకి సంబంధం ఉందా? అని జేమ్స్ కామెరాన్ ని పార్ట్ 1 రిలీజ్ సమయంలో ఇండియన్ మీడియా ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించింది.

Krishna : బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కుటుంబ సభ్యులు.. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు..!

ఆ ప్రశ్నకు జేమ్స్ కామెరాన్ ఇలా బదులిచ్చాడు.. “నేను హిందూ మతాన్ని, పురాణాల్ని ఇష్టపడతాను. అవి చాలా గొప్పగా మరియు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక అవతార్ కి హిందూ పురాణాలకి సంబంధం ఉందా? అంటే.. ఉందనే చెప్పాలి. అయితే నేను హిందూ మతాన్ని పూర్తిగా ప్రస్తావించదలచుకోలేదు. అందుకే దానిని నుంచి సోల్ ని మాత్రమే తీసుకున్నాను. అలా చేయడం చేయడంలో నేను ఎవరినీ కించపరచలేదని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం ఈ ఒక్క సినిమాలోనే మాత్రమే కాదు హాలీవుడ్ లోని చాలా సినిమాల్లో హిందూ పురాణాల రిఫరెన్స్ కనిపిస్తుంది.