బాలు గారు క్షేమంగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను..

  • Published By: sekhar ,Published On : August 15, 2020 / 08:44 PM IST
బాలు గారు క్షేమంగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను..

Updated On : August 21, 2020 / 12:11 PM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలంటూ పవర్ స్టార్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బాలు గారు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులు అని తెలుపుతూ పవన్ ఓ లేఖ విడుదల చేశారు.

‘‘ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో స్థైర్యం ఉన్నవారు. ఆయన ప్రస్తుత అనారోగ్య స్థితి నుంచి వీలైనంత త్వరగా కోలుకొని మన ముందుకు వస్తారనే విశ్వాసం ఉంది. చెన్నైలో లైఫ్ సపోర్ట్‌తో ఉన్నారు అని నిన్నటి రోజున తెలియగానే ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న ఆయన తప్పకుండా కోలుకొంటారని భావించాను.
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఊరటనిచ్చే వార్త ఇది. మా కుటుంబానికి శ్రీ బాలు గారు ఎంతో సన్నిహితులు.
వారు ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’.. అంటూ పవన్ లేఖలో పేర్కొన్నారు.

Pawan Kalyan