Janhvi Kapoor : #NTR30 అప్డేట్.. అనుకున్నదే అయింది.. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీనే హీరోయిన్..
తాజాగా నేడు ఉదయం ఎన్టీఆర్ 30వ సినిమా నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ 30వ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ 30వ సినిమాలో................

Janhvi Kapoor is the female lead in NTR30 movie under koratala siva direction
Janhvi Kapoor : RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు ప్రకటించినా అవి ఇంకా మొదలవ్వలేదు. అభిమానులు ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల మార్చ్ చివర్లో షూటింగ్ మొదలుపెడతారని, సినిమా పూజా కార్యక్రమం ఫిబ్రవరిలో జరుగుతుందని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. కానీ నందమూరి తారకరత్న మరణించడంతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం వాయిదా పడింది. నేడు ఉదయం ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం అమెరికాకు బయలుదేరాడు.
మళ్ళీ ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చేవరకు ఎన్టీఆర్ 30 పై ఎలాంటి అప్డేట్ ఉండదు. ఎన్టీఆర్ వచ్చాకే ఈ సినిమా పనులు మొదలవుతాయని అంతా భావిస్తున్నారు. కానీ తాజాగా నేడు ఉదయం ఎన్టీఆర్ 30వ సినిమా నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ 30వ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వీనే హీరోయిన్ అని వార్తలు వచ్చినా దీనిపై ఎవరూ స్పందించలేదు. ఇక జాన్వీ కూడా గతంలో పలు ఇంటర్వ్యూలలో సౌత్ సినిమాల నుంచి ఆఫర్స్ వస్తే నటిస్తానని, ఎన్టీఆర్ నా ఫేవరేట్ హీరో అని, ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది.
జాన్వీ కపూర్ కోరుకున్నట్టే ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ రావడంతో జాన్వీ ఓకే చేసేసింది. జాన్వీకి బాలీవుడ్ లోనే కాక సౌత్ లో కూడా అభిమానులు భారీగానే ఉన్నారు. శ్రీదేవి అభిమానులు కూడా జాన్వీ సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ 30వ సినిమాతో జాన్వీ తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వబోతుంది. శ్రీదేవి తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. జాన్వీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నా ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా పడలేదు. RRR తర్వాత ఎన్టీఆర్ కి నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో ఎన్టీఆర్ 30వ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ కొడితే జాన్వీ తెలుగు సినిమాని నెత్తిన పెట్టుకోవడం, వరుస తెలుగు సినిమాల్లో నటించడం ఖాయం అంటున్నారు. ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ జోడి ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
Ghosty : కాజల్ కంబ్యాక్ సినిమా గ్రాండ్ రిలీజ్.. మార్చ్ 17న థియేటర్స్ లోకి ఘోస్టీ..
ఇక చిత్రయూనిట్ జాన్వీ కపూర్ ఫొటోతో రిలీజ్ చేసిన పోస్టర్ ని జాన్వీ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఫైనల్ గా ఇది జరుగుతుంది. నా ఫేవరేట్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం చాలా ఆనందంగా అంది అని పోస్ట్ చేసింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు జాన్వీకి టాలీవుడ్ లోకి వెల్కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
She's the calm in the storm from the fierce world of #NTR30 ❤️
Happy Birthday and welcome onboard #JanhviKapoor ?@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @NTRArtsOfficial pic.twitter.com/kV2EVCs0pw
— Yuvasudha Arts (@YuvasudhaArts) March 6, 2023