Janhvi Kapoor: వెకేషన్‌లో జాన్వీ.. ఎన్నాళ్ళు ఇలా ఊరిస్తావ్ తల్లో!

అతిలోక సుందరి కూతురు ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Janhvi Kapoor: వెకేషన్‌లో జాన్వీ.. ఎన్నాళ్ళు ఇలా ఊరిస్తావ్ తల్లో!

Janhvi Kapoor

Updated On : April 19, 2022 / 10:31 AM IST

Janhvi Kapoor: అతిలోక సుందరి కూతురు ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుగులో మంచి క్రేజ్ ఉన్న జాన్విని ఎప్పుడెప్పుడు తెలుగు స్క్రీన్ మీద చూస్తామా అని ఆశపడుతున్నారు ఫాన్స్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి కూతురు జాన్వికపూర్.. ప్రజెంట్ బాలీవుడ్ హీరోయిన్ అయినా.. సౌత్ కనెక్షన్ ఉండడంతో టాలీవుడ్.. జాన్వీని బాగా ఓన్ చేసుకుంటోంది.

Janhvi Kapoor: అయ్యగారితో అమ్మగారి ఎంట్రీ.. ఖాయమేనా?

అందుకే జాన్వి తెలుగులో హీరోయిన్ గా చేస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. దానికోసం మేకర్స్ కూడా చాలా రోజుల నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జాన్వి కూడా అప్పుడప్పుడు సౌత్ లో సినిమాలు తప్పకుండా చేస్తానని ఓపెన్ గానే చెబుతోంది. అంతేకాదు.. కొందరు హీరోలతో సినిమాలు చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపించింది కూడా. జాన్విని టాలీవుడ్ లో ఎంట్రీ ఇప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటి వరకు అవేమీ వర్కౌట్ కాలేదు.

Janhvi Kapoor: ఇప్పటికైతే అవన్నీ పుకార్లే.. మరి జాన్వీ ఎంట్రీ ఎప్పుడు?

ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న జాన్వీ హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మాత్రం హీట్ పుట్టిస్తుంది. అవి చాలదని ఏదో ఒక వంకలతో దక్షణాది రాష్ట్రాలను కూడా చుట్టేస్తోంది. సోషల్ మీడియాలో జాన్వీను చూసిన మన ప్రేక్షకులు మా హీరోలతో ఎప్పుడు జాన్వీ అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. మా హీరోల సినిమాలలో కనిపించవు కానీ.. ఇలా సోషల్ మీడియాలో ఎన్నాళ్ళు ఊరిస్తావ్ తల్లో అంటూ సౌత్ ఆడియన్స్ అమ్మడి వైపు ఆశగా చూస్తున్నారు. మరో ఈ డాటర్ ఆఫ్ అతిలోకసుందరి ఆగమనం ఎప్పుడో!