Janhvi Kapoor: అయ్యగారితో అమ్మగారి ఎంట్రీ.. ఖాయమేనా?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతుందా అని ఇక్కడి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Janhvi Kapoor: అయ్యగారితో అమ్మగారి ఎంట్రీ.. ఖాయమేనా?

Jhanvi Kapoor With Akhil Akkineni

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతుందా అని ఇక్కడి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపునే సాధించుకుంది. అయితే తెలుగులో మాత్రం ఇంకా ఈ అమ్మడు అడుగుపెట్టలేదు. దీంతో ఈమెను టాలీవుడ్‌లో ఓ భారీ చిత్రంతో లాంఛ్ చేయాలని ఆమె తండ్రీ బోనీ కపూర్‌తో పాటు తెలుగు దర్శకనిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు.

Akhil Akkineni: ‘ఏజెంట్’ రాకకు డేట్ ఫిక్స్!

ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ చిత్రంగా రాబోతున్న సినిమాలో జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారనే వార్త కొంతకాలంగా తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దీంతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ మళ్లీ డైలమాలో పడిపోయింది. ఏ హీరోతో ఆమె తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇస్తుందా అని అందరూ అనుకుంటున్నారు.

NTR30: ఎన్టీఆర్, కొరటాల సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ?

కాగా ఇప్పుడు మరోసారి జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించబోయే ఓ సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమాను రెడీ చేసిన అఖిల్ తన నెక్ట్స్ మూవీ కోసం అప్పుడే రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి ఏకంగా ఓ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు ఈ హీరో సిద్ధపడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ ఈ సినిమాను రూపొందించనున్నాడట.

పాన్ ఇండియా ఆడియెన్స్‌ను మెప్పించే కథను కరణ్ జోహర్ సిద్ధం చేశాడట. కాగా ఈ సినిమాను తీర్చిదిద్దే ఓ సరైన డైరెక్టర్ కోసం ఆయన వెతుకుతున్నాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే అఖిల్ చేయబోయే ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఖాయమే అంటున్నారు బాలీవుడ్ సినీ ఎక్స్‌పర్ట్స్. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.