Janhvi Kapoor: చెల్లి బర్త్ డే.. బార్బీ బేబీగా మెరిసిపోయిన జాన్వీ!
జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు కదా. అతిలోక సుందరి వారసురాలిగా వెండి తెరని ఏలేందుకు తహతహ లాడుతున్న ఈ చిన్నది అందుకు ఏ అవకాశం వచ్చినా వదలకుండా..

Janhvi Kapoor
Janhvi Kapoor: జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు కదా. అతిలోక సుందరి వారసురాలిగా వెండి తెరని ఏలేందుకు తహతహ లాడుతున్న ఈ చిన్నది అందుకు ఏ అవకాశం వచ్చినా వదలకుండా సోకుల గాలమేసి కుర్రాళ్ళ హృదయాలలో తిష్టవేసి కూర్చుంటుంది. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన ఈ సుందరి ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. సినిమాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో జాన్వీ సొగసులు రుచి చూడని వారుండరు.
Janhvi Kapoor: జాన్వీ, సారా ఆథ్యాత్మిక యాత్ర.. ఇంతలో అంత మార్పా?
తాజాగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ 21వ పుట్టినరోజును జరుపుకోగా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకొనేందుకు భారీ పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో జాన్వీ స్పెషల్ బార్బీ బేబీగా మెరిసిపోయింది. ఈ వేడుకల్లో సిస్టర్స్ ఇద్దరూ అందంగా పింక్ దుస్తులు ధరించి వయ్యారాలు ఒలకబోశారు. తమ రూఫ్ టాప్ పై జరిగిన ఈ పుట్టినరోజు పార్టీ నుండి జాన్వీ తన సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

Janhvi Kapoor
Janhvi Kapoor: అందాల నెరజాణ జాన్వీ.. తెలుగులో భాగ్యమెప్పుడో?
ఈ ఫోటోలలో జాన్వీ పింక్ లో మెరిసిపోతుంటే అరవిరిసిన అందాలు దాగకుండా పార్టీకే స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాయి. మొత్తంగా ఎప్పటిలానే జాన్వీ అందాల జాతరతో సోషల్ మీడియా షేక్ అవగా.. ఎప్పటిలాగానే జాన్వీతో అత్యంత క్లోజ్ గా కనిపిస్తున్న ఓ కుర్రాడు ఈ వేడుకలో కూడా ఈ సిస్టర్స్ తో ఇచ్చిన ఫోజులు ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఈ కుర్రాడెవరా అని కొందరు ఆరాలు తీస్తుంటే.. మరికొందరు కుర్రాడెవరైతే ఏంటి కానీ జాన్వీ మాత్రం రోజురోజుకూ అప్సరసలా మారిపోతూ నోరూరిస్తుందని లొట్టలేసుకుంటున్నారు.