Maheswari : చాలా రోజులు తరవాత కనిపించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. అక్కతో జాన్వీ ఫోటోలు..

గులాబీ, పెళ్లి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి 'మహేశ్వరీ'. 'తిరుమల తిరుపతి వేంకటేశ' సినిమా తరువాత మరో సినిమా చేయని ఈ భామ, తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. శ్రీదేవి, మహేశ్వరికి..

Maheswari : చాలా రోజులు తరవాత కనిపించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. అక్కతో జాన్వీ ఫోటోలు..

Janhvi Kapoor with his cousin Maheswari

Updated On : November 27, 2022 / 6:19 PM IST

Maheswari : గులాబీ, పెళ్లి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ‘మహేశ్వరీ’. దాదాపు సౌత్‌లోని స్టార్ హీరోస్ జగపతిబాబు, రవితేజ, అజిత్ కుమార్, విక్రమ్, అర్జున్ సర్జ, శివ రాజ్ కుమార్ వంటి అందరి స్టార్స్ తో కలిసి నటించింది. ‘తిరుమల తిరుపతి వేంకటేశ’ సినిమా తరువాత మరో సినిమా చేయని ఈ భామ ఆ తరువాత కాలంలో తమిళ టెలివిజన్ లో కనిపించింది.

Orange Re Release : ఆరెంజ్ రీ రిలీజ్.. నేను విన్నాను, నేను ఉన్నాను అంటున్న నాగబాబు..

2014 నుంచి టెలివిజన్ రంగానికి కూడా గుడ్ బై చెప్పేసిన ఈ నటి. ఈ మధ్యకాలంలో ప్రముఖ తెలుగు టెలివిజన్ కామెడీ షోలో అడపాదడపా కనిపిస్తుంది. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. శ్రీదేవి, మహేశ్వరికి పిన్ని అవుతుంది. కాగా శనివారం నాడు హైదరాబాద్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోకి హాజరయ్యిన జాన్వీ కపూర్, తన అక్క మహేశ్వరిని కలిసింది.

ఇద్దరు కలిసి ఆ షోలో సందడి చేశారు. ఈ ఫోటోలను జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ఇక ఆ షోలో జాన్వీ మాట్లాడుతూ.. “నేనూ సౌత్ అమ్మాయినే, సౌత్‌తో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. తెలుగులో సినిమా చేయడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను. త్వరలోనే ఆ కోరిక తీరుతుందని అనుకుంటున్నాను” అని తెలిపింది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)