Allu Arjun: భారీ హైప్ క్రియేట్ చేస్తున్న పిక్.. ఫొటోలో బన్నీతో ఉన్నది ఎవరో తెలుసా.. ఇది నెక్స్ట్ లెవల్ సెటప్
అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న (Allu Arjun)విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Japanese dancer and choreographer Hokuto Konishi is working on Allu Arjun's film
Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న (Allu Arjun)విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. భారీ విజువల్స్, హాలీవుడ్ రేంజ్ వీఎఫెక్స్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక టెక్నీషయన్స్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పటికే ఈ సినిమా కోసం అవతార్, ఎవెంజర్స్, స్టార్ వార్ లాంటి సినిమాలకు వర్క్ చేసిన వారిని హైర్ చేసుకోగా ఇప్పుడు ఈ లిస్టులోకి మరో స్టార్ టెక్నీషియన్ చేరాడు. ఆ టెక్నీషియన్ మరెవరో కాదు “హొకుటో కొనిషి”. ఈయన ప్రముఖ జపనీస్-బ్రిటిష్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. అల్లు అర్జున్ సినిమా కోసం హొకుటో కొనిషిని తీసుకున్నారట. ఇప్పటికే ఈ డాన్సర్ ముంబై లో అడుగుపెట్టేశాడట. సినిమాకు సంబంధించి పనులు కూడా మొదలుపెట్టేశాడట. ఆ సమయంలో అల్లు అర్జున్ తో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.
ఆ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్స్ అవాక్కవుతుండగా.. చాలా మంది మాత్రం అతను ఎవరో తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఆయన గురించి తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పాపులర్ అయిన అల్లు అర్జున్.. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి ఎదగడం ఖాయం అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. 2027లో ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.