Jathara : షూటింగ్ జరిగినన్ని రోజులు వర్షం పడినా ఇబ్బంది కలగలేదు.. అంతా అమ్మవారి మహిమ..
జాతర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 8న రిలీజ్ కానుంది.

Jathara Movie Producer Interesting Comments on Shooting Days
Jathara : సతీష్ బాబు రాటకొండ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా ‘జాతర’. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సి, రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా ఆతెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఓ జాతర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 8న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు నిర్మాత శివ శంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
శివ శంకర్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ.. నేను గతంలో సాయి కుమార్, వినోద్ కుమార్ కాంబోలో ఒక సినిమా చేశాను. ఇప్పుడు సతీష్ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ జాతర సినిమా చేశాను. చిత్తూరు జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తీసాం. 18 గ్రామాలకు కాపు కాసే దేవత చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉంటుంది సినిమా అని తెలిపారు.
Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ టీజర్ ఈ థియేటర్స్‌లో చూసేయండి.. దేశవ్యాప్తంగా 11 థియేటర్స్ లిస్ట్..
అలాగే.. జాతర సినిమాని మూడు షెడ్యూల్స్‌లో 73 రోజుల పాటు షూటింగ్ చేసాము. ఆల్మోస్ట్ షూటింగ్ చేసినన్ని రోజులు వర్షం పడుతూనే ఉండి. అయినా ఎప్పుడూ షూటింగ్‌కు ఆటంకం కలగలేదు. అదంతా అమ్మవారి మహిమే అని నమ్ముతాను. సెన్సార్ వాళ్లు ఎక్కడా మాకు కట్స్ చెప్పలేదు. సినిమా అంతా ఒకెత్తు అయితే చివరి 20 నిమిషాలు ఇంకో ఎత్తు అని ప్రశంసించారు అని తెలిపారు.