బన్నీ తర్వాత బెల్లంకొండే.. బోయపాటి న్యూ రికార్డ్..

  • Published By: sekhar ,Published On : September 4, 2020 / 04:18 PM IST
బన్నీ తర్వాత బెల్లంకొండే.. బోయపాటి న్యూ రికార్డ్..

Updated On : September 4, 2020 / 6:23 PM IST

Boyapati Srinu 2 Movies gets 300 Million Views: ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. శ్రీను దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ఈ ఘనత సాధించిపెట్టాయి. వివరాల్లోకి వెళ్తే.. కొంతకాలంగా తెలుగు సినిమాల హిందీ వెర్షన్‌లు యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.



బెల్లంకొండ శ్రీనివాస్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఏకంగా 300 మిలియన్స్ (30 కోట్లు) వ్యూస్ సాధించింది. 300 మిలియన్స్ మార్క్ దాటిన రెండో సినిమాగా నిలిచింది. తొలి స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమా ఉంది. ఈ రెండు మాస్ యాక్షన్ సినిమాలను బోయపాటి శ్రీను తెరకెక్కించడం విశేషం.


అలాగే రెండు సినిమాల్లోనూ రకుల్ ప్రీత్ కథనాయికగా నటించగా కేథరిన్ ‘సరైనోడు’లో కీలక పాత్ర పోషించింది. ‘జయ జానకి నాయక’లో స్పెషల్ సాంగ్ చేసింది. గీతా ఆర్ట్స్, ద్వారకా క్రియేషన్స్ ఈ సినిమాలను నిర్మించాయి. ‘జయ జానకి నాయక’లోని హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బోయపాటి డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు హిందీలో అదరగొడుతున్నాయి.Boyapati Srinu