Ponniyin Selvan II : పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్.. ట్విట్టర్ బ్లూ టిక్ పోగొట్టుకున్న త్రిష, జయం రవి..

పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ భాగంగా జయం రవి, త్రిష తమ ట్విట్టర్ అకౌంట్స్ లో తమ పేరులను చేంజ్ చేశారు. దీంతో వారిద్దరూ ట్విట్టర్ లోని తమ బ్లూ టిక్‌ను కోల్పాయారు.

Ponniyin Selvan II : పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్.. ట్విట్టర్ బ్లూ టిక్ పోగొట్టుకున్న త్రిష, జయం రవి..

Jayam Ravi and Trisha are lost twitter blue tick due to PS II promotions

Updated On : April 17, 2023 / 7:01 PM IST

Ponniyin Selvan II : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శక నిర్మాణంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. తమిళుల చరిత్రకు సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తుంది. మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్ (Vikram), ఐశ్వర్య బచ్చన్ (Aishwarya Rai Bachchan), జయం రవి (Jayam Ravi), కార్తీ (Karthi), త్రిష (Trisha), ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ వంటి భారీ స్టార్ క్యాస్ట్ నటించింది.

Thangalaan : వామ్మో ఇదెక్కడి ట్రాన్స్ఫర్మేషన్ రా బాబు.. తంగలాన్ మేకింగ్ వీడియో రిలీజ్.. విక్రమ్ ని చూసి భయపడుతున్న ప్రేక్షకులు..

కాగా ఈ మూవీ సెకండ్ పార్ట్ PS2 ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే పలు ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే జయం రవి, త్రిష తమ ట్విట్టర్ అకౌంట్స్ లో తమ పేరులను చేంజ్ చేశారు. పొన్నియిన్ సినిమాలోని తమ పాత్రల పేర్లు అరుణ్మోళి వర్మన్‌, కుందవై ని తమ ట్విట్టర్ అకౌంట్ కి పెట్టుకున్నారు. అయితే ఆ తరువాత నుంచి ట్విట్టర్ లోని తమ బ్లూ టిక్‌ను కోల్పాయారు.

Jayam Ravi and Trisha are lost twitter blue tick due to PS II promotions

Jayam Ravi and Trisha are lost twitter blue tick due to PS II promotions

దీంతో త్రిష కుందవై పేరుని తొలిగించి మళ్ళీ తన పేరునే పెట్టుకుంది. కానీ బ్లూ టిక్ మాత్రం తిరిగి రాలేదు. జయం రవి మాత్రం అరుణ్మోళి పేరునే కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, తమిళనాడులో తప్ప ఈ సెకండ్ పార్ట్ పై మరో భాషలో పెద్ద ఆసక్తి కల్పించడం లేదు. మరి ఎటువంటి బజ్ లేకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Jayam Ravi and Trisha are lost twitter blue tick due to PS II promotions

Jayam Ravi and Trisha are lost twitter blue tick due to PS II promotions