Suma Kanakala : ‘జయమ్మ పంచాయితీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ సినిమాల మధ్యలో సుమక్క సినిమా

యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో 'జయమ్మ పంచాయతీ' అనే సినిమాని అనౌన్స్ చేశారు. విలేజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందించబడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల...

Suma Kanakala : ‘జయమ్మ పంచాయితీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ సినిమాల మధ్యలో సుమక్క సినిమా

Jayamma Panchayithi

Updated On : March 14, 2022 / 12:33 PM IST

 

Jayamma Panchayithi :  తెలుగు ప్రేక్షకులకి, ప్రతి ఇంట్లో పరిచయం ఉన్న వ్యక్తి, గత 15 ఏళ్లుగా బుల్లితెరని ఏలుతున్న యాంకర్ సుమ కనకాల. ఇప్పటికే సుమ కనకాల తిరుగులేని యాంకర్ గా పేరు సంపాదించింది. యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సందించుకుంది. యాంకర్ గా బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరిపిస్తూ ఉంటుంది సుమ. ఇటీవల సుమ మెయిన్ లీడ్ లో ఓ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. విలేజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందించబడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణని సంపాదించాయి. అయితే ప్రస్తుతం వరుసగా భారీ సినిమాలన్నీ రిలీజ్ కి ఉన్నాయి. ఈ భారీ సినిమాల మధ్యలో సుమ ‘జయమ్మ పంచాయితీ’ రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.

Shree Rapaka : బిగ్‌బాస్‌ నుంచి ఆర్జీవీ భామ అవుట్..

ఇవాళ జయమ్మ పంచాయితీ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 22న సుమ నటించిన ‘జయమ్మ పంచాయితీ’ రిలీజ్ అవ్వనుంది. దీనికి సంబంధించి సుమ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో డేట్స్ అన్ని స్టార్ హీరోల సినిమాలతో బుక్ అయిపోయాయి నేనెప్పుడు రిలీజ్ చేయాలి అంటూ డేట్ ని అనౌన్స్ చేస్తుంది సుమ. సమ్మర్ లో భారీ సినిమాల మధ్యలో సుమ సినిమా రిలీజ్ కి సిద్ధపడింది అంటే డేర్ చేసిందనే అనుకోవచ్చు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.