JD Chakravarthy : గులాబీ కథని ప్రొడ్యూస్ చేయమని రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్తే.. నన్ను హీరోగా వద్దని..
దయ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో JD చక్రవర్తి మాట్లాడుతూ ఉత్తేజ్ గురించి, కృష్ణవంశీ గురించి, గులాబీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

JD Chakravarthy interesting comments on Gulabi movie and Hero Rajasekhar
JD Chakravarthy : మనీ, గులాబీ, బొంబాయి ప్రియుడు.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తెలుగు ప్రేక్షకులకి అందించాడు JD చక్రవర్తి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు, సిరీస్ లు చేస్తున్నారు. JD చక్రవర్తి మెయిన్ లీడ్ లో త్వరలో దయ అనే వెబ్ సిరీస్ రానుంది. ఈ సిరీస్ త్వరలోనే హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి ఉత్తేజ్, డైరెక్టర్ కృష్ణవంశీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
దయ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో JD చక్రవర్తి మాట్లాడుతూ ఉత్తేజ్ గురించి, కృష్ణవంశీ గురించి, గులాబీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఉత్తేజ్ తనని సినిమాలకి తీసుకొచ్చాడని, అసలు ఉత్తేజ్ లేకపోతే తను సినిమాల్లోనే ఉండేవాడిని కాదని JD చక్రవర్తి అన్నారు.
ఇక గులాబీ, కృష్ణవంశీ గురించి మాట్లాడుతూ.. కృష్ణవంశీ లేకపోతే నేను ఇవాళ ఈ స్టేజిమీద ఉండేవాడిని కాదు. గులాబీ సినిమా కోసం మేమిద్దరం చాలా తిరిగాం, చాలా కష్టపడ్డాం. సినిమాని ఆర్జీవీ గారు ప్రొడ్యూస్ చేయకముందు ఈ కథని చాలా మంది నిర్మాతలకి చెప్పాము. సినిమా మొదలయి కూడా ఆగిపోయింది. అప్పుడు గులాబీ కథని హీరో రాజశేఖర్ గారికి వినిపించమని కృష్ణవంశీని తీసుకెళ్ళాను. కానీ వంశీ వేరే కథ చెప్తుంటే గులాబీ కథ చెప్పమని చెప్పాను.
కృష్ణవంశీ చెప్పిన గులాబీ కథ మొత్తం విని రాజశేఖర్ గారు ఆయన హీరోగా చేస్తాను అన్నారు. అందులో బ్రహ్మజీ క్యారెక్టర్ నన్ను చేయమన్నారు. వంశీ సైలెంట్ గా వచ్చేస్తే నేను ముందు నువ్వు డైరెక్టర్ అవ్వడం ఇంపార్టెంట్, ఆయన ప్రొడ్యూస్ చేస్తా అంటున్నాడు, నాకు ప్రాబ్లమ్ లేదు, మనం తర్వాత సినిమా చేసుకోవచ్చు అని చెప్పినా వినలేదు. నేను గులాబీ సినిమా చేస్తే చక్రితోనే చేస్తాను, లేకపోతే అసలు ఈ సినిమా చేయను అని అంత స్ట్రాంగ్ గా నిలబడి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు కాబట్టే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అని తెలిపారు.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందా? ఇంకో సినిమా చూసుకోనున్న హరీష్ శంకర్..?
అలాగే గులాబీ సినిమా తర్వాత మళ్ళీ దాదాపు 25 ఏళ్ళ తర్వాత నేను, కృష్ణవంశీ ఇలా ఒక స్టేజిపై కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్లు మేము సినిమా స్టేజిపై కలవలేదు అని తెలిపారు. అనంతరం తన దయ సిరీస్ గురించి మాట్లాడారు.