Yatra 2 : యాత్ర 2 మొదలైంది.. సీఎం జగన్‌లా కనిపించబోతున్న జీవా.. వీడియో వైరల్..
యాత్ర 2 షూటింగ్ మొదలైందట. సీఎం జగన్ పాత్రని తమిళ నటుడు జీవానే పోషిస్తున్నాడు. షూటింగ్ సెట్స్ నుంచి ఒక వీడియో..

Jiiva play as YS Jagan Mohan Reddy role in Yatra 2
Yatra 2 : మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా 2019 ఎన్నికల సమయంలో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘యాత్ర’. మలయాళ హీరో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని తీసుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మహీ వి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సెకండ్ పార్ట్ ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నాడు.
Kamal Haasan : ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి
ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో ఎవరు నటిస్తారు అని అందరిలో ఆసక్తి నెలకుంది. ముందు నుంచి ఈ మూవీలో జగన్ రోల్ ని తమిళ నటుడు ‘జీవా’ (Jiiva) నటిస్తాడు అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. దీని గురించి దర్శకుడిని ప్రశ్నించినా.. జవాబు రాలేదు. అయితే ఈ మూవీలో జీవా ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ మూవీ కూడా మొదలైనట్లు సమాచారం. తాజాగా జీవా.. జగన్ గా నటిస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో జీవా జగన్ గెటప్ లో కనిపించి ఆయనలా నటిస్తూ కనిపిస్తున్నాడు.
యాత్ర -2 షూటింగ్ ఫుల్ స్వింగ్ 🔥🔥@JiivaOfficial @ysjagan pic.twitter.com/bXMhGy0PyF
— MBYSJ Trends ™ (@MBYSJTrends) September 24, 2023
అయితే ఇది స్టిల్ ఫోటోషూట్ అని తెలుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. జగన్ గా జీవా కరెక్ట్ గా సెట్ అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని V సెల్యులాయిడ్స్, త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కల్కి 2898 AD మూవీకి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణ్ ఈ యాత్ర 2కి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. 2024 ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఎన్నికల లక్ష్యంగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది. మరి ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.