Jr Ntr: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఆరంభం.. ఓపెనింగ్ షార్టే బ్లాస్టింగ్..

దీంతో ఎన్టీఆర్‌ -నీల్‌ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Jr Ntr: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఆరంభం.. ఓపెనింగ్ షార్టే బ్లాస్టింగ్..

Updated On : February 20, 2025 / 3:44 PM IST

ఆర్ఆర్ఆర్, దేవర, వార్‌ 2 వంటి సినిమాల తర్వాత యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. దర్శకుడు ప్రశాంత్ నీల్‌ కాంబోలో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇవాళ ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభమైందంటూ మైత్రి మూవీ మేకర్స్‌ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో ఎన్టీఆర్‌ -నీల్‌ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు గత ఏడాదే పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ అనుకున్నదాని కంటే కాస్త ఆలస్యంగా షూటింగ్‌ ప్రారంభమైంది.

ఎన్టీఆర్ ‘వార్‌ 2’ సినిమాలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌ హీరో కాగా, కీలక కూడా ఓ రేంజ్‌లో ఉండే పాత్రల నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఓపెనింగ్‌ షార్ట్ సెట్స్‌లోనే సుమారు 1,500 మంది జూనియర్ ఆర్టిస్టులతో నీల్‌ షూటింగ్‌ తీసినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల తర్వాత నీల్ తీస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.