Evaru Meelo Koteeswarulu : యంగ్ టైగర్ ఎంట్రీ ఎప్పుడంటే..!

ఎన్టీఆర్ ఎంటర్ అవడమే లేటు.. చకచకా కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసేసి, ఆ తర్వాత ప్రోమోస్‌తో పాటు టెలికాస్ట్ డేట్ అండ్ టైం అనౌన్స్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది..

Evaru Meelo Koteeswarulu : యంగ్ టైగర్ ఎంట్రీ ఎప్పుడంటే..!

Ntr

Updated On : July 2, 2021 / 1:11 PM IST

Evaru Meelo Koteeswarulu: ‘ఆట నాది.. కోటి మీది’.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పేద ప్రజల కలల్ని నిజం చెయ్యడానికి, సామాన్యులను సంపన్నులను చెయ్యడానికి త్వరలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లోకి రాబోతున్నారు.

120 దేశాల్లో కామన్ మ్యాన్ లైఫ్‌ని అనూహ్యంగా మార్చి, ఇండియాలో 9 భాషల్లో ఆల్‌టైమ్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాపులర్ షో ను సన్ నెట్‌వర్క్, జెమిని టీవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది.

Jr.NTR : ఎపిసోడ్‌కి ఎంత తీసుకుంటున్నాడంటే..

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ కి సంబంధించి రెడు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిలో ఒక సాంగ్ రామ్ చరణ్ – ఆలియా భట్ మీద పిక్చరైజ్ చేయబోతున్నారు. తర్వాత పాటలో తారక్ కూడా పాల్గొంటారట. దీంతో షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేస్తారు. సో, తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్‌లోనే జూనియర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షూట్‌కి షిఫ్ట్ అవుతారు.

Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…

ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో అదిరిపోయే సెట్ వేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పక్కాగా జరిగిపోయింది. ఎన్టీఆర్ ఎంటర్ అవడమే లేటు.. చకచకా కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసేసి, ఆ తర్వాత ప్రోమోస్‌తో పాటు టెలికాస్ట్ డేట్ అండ్ టైం అనౌన్స్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది.