Jr.NTR : ఎపిసోడ్‌కి ఎంత తీసుకుంటున్నాడంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్సింగ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Evaru Meelo Koteeswarulu Promo
Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్సింగ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. 120 దేశాల్లో కామన్ మేన్ లైఫ్‌ని అనూహ్యంగా మార్చి, ఇండియాలో 9 భాషల్లో ఆల్‌టైమ్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పాపులర్ షో ను ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో సన్ నెట్‌వర్క్, జెమిని టీవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది.

Evaru Meelo Koteeswarulu
తారక్ ఈ షో ను హోస్ట్ చెయ్యనున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోతో తన స్టైల్లో ఆకట్టుకుని షో పై అంచనాలు పెంచేశాడు యంగ్ టైనర్.. తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కు ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా అంటూ పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Evaru Meelo Koteeswarulu : ఆట నాది కోటి మీది.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో చూశారా..
ఈ బిగ్గెస్ట్ షో కి ఒక్క ఎపిసోడ్‌కి గానూ అక్షరాలా యాభై లక్షల రూపాయల పారితోషికం ఇస్తున్నారట నిర్వాహకులు.. త్వరలో ఎంట్రీస్ స్టార్ట్ కానున్నాయి. ఏప్రిల్ నుండి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ జెమిని టీవీలో టెలికాస్ట్ కానుంది. సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. అక్టోబర్ 13న విడుదల కానుంది. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నాడు తారక్..