ఆర్ఆర్ఆర్‌కు ముందే తారక్ డేరింగ్ డెసిషన్

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియాపై కన్నేసిన తారక్.. అంతకుముందుగానే ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ ప్రాజెక్ట్‌తో వేరే భాషల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారని భావించినా.. ముందుగానే తన డబ్బింగ్ సినిమాలతో వేరే భాషాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు తారక్. ఈ క్రమంలోనే యమదొంగ సినిమాని తమిళంలో డబ్బింగ్ చేసి అక్కడ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నాడు తారక్.
యమదొంగ సినిమా తమిళ తెరపైకి జనవరి 3వ తేదీన విడుదల అవుతుంది. బాహుబలి చిత్రం ఫేమ్ ఎస్‌ఎస్.రాజమౌళి బాహుబలి సినిమాకి ముందే తెలుగులో తన దర్శకత్వంలో తీసిన సినిమా యమదొంగ. ఎన్టీఆర్ కథానాయకుడిగానూ ప్రముఖ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలోనూ నటించిన ఈ సినిమా 2007లో విడుదలైంది. నటి కుష్బూ, ప్రియమణి, మమతామోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.
అయితే తమిళనాట బాహుబలితో రాజమౌళికి వచ్చిన క్రేజ్‌తో పాటు ఎన్టీఆర్ స్టామినా ఏంటో తెలియజేయాలంటే ఈ సినిమా కరెక్ట్ అని భావించి ఈ సినిమాని అక్కడ ముందుగా రిలీజ్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ సినిమాగా భూలోకం, యమలోకంలో జరిగే సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలో విజయన్ పేరుతో అనువాదమైంది. దీనికి అనువాద రచయితగా ఏఆర్‌కే.రాజా పనిచేశారు. దీన్ని తమిళంలో ఓం శ్రీసప్త కన్నియమ్మన్ పతాకంపై ఎం.జయకీర్తి, రేవతీ మేఘవన్నన్ అనువదించారు.