Kajal Aggerwal : ఉగాదికి తెలుగులో కంబ్యాక్ ఇవ్వబోతున్న కాజల్.. తమిళ్ డబ్బింగ్ తో..

తమిళ్ లో కాజల్ మెయిన్ లీడ్ లో చేసిన ఘోస్టీ సినిమా కామెడీ హారర్ కథాంశంతో ఇటీవల మార్చ్ 17న తమిళ్ లో రిలీజయింది. కామెడీ హారర్ కావడం, కాజల్ కంబ్యాక్ సినిమా కావడంతో తమిళ్ లో ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కూడా...............

Kajal Aggerwal : ఉగాదికి తెలుగులో కంబ్యాక్ ఇవ్వబోతున్న కాజల్.. తమిళ్ డబ్బింగ్ తో..

Kajal Aggerwal comeback in telugu with tamil movie Ghosti

Updated On : March 20, 2023 / 7:37 AM IST

Kajal Aggerwal :  2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ మధ్యలో కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేసింది కాజల్. కరోనా సమయంలో సడెన్ గా ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది కాజల్. పెళ్లి, ఆ తర్వాత బాబు పుట్టడంతో ఇన్ని రోజులు సినిమాలకు దూరంగానే ఉంటూ చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా వదిలేసుకుంది. ఇక ఇటీవలే కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయినా కాజల్ పలు ప్రాజెక్టులను ఒప్పుకుంది.

Sir Movie : నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతున్న సార్.. తెలుగు, తమిళ్ రెండూ ట్రెండ్ లోనే..

తమిళ్ లో కాజల్ మెయిన్ లీడ్ లో చేసిన ఘోస్టీ సినిమా కామెడీ హారర్ కథాంశంతో ఇటీవల మార్చ్ 17న తమిళ్ లో రిలీజయింది. కామెడీ హారర్ కావడం, కాజల్ కంబ్యాక్ సినిమా కావడంతో తమిళ్ లో ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. తమిళ్ సినిమాకి డబ్బింగ్ వర్షన్ తో ఉగాది నాడు మార్చ్ 22న తెలుగులో కూడా ఘోస్టీ సినిమాని కోస్టి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కాజల్ పోలీసాఫీసర్ గా నటించింది. దీంతో కాజల్ తెలుగు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి తెలుగులో ఈ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.