Kajol: కాజోల్కు కరోనా పాజిటివ్!
సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా బాలీవు బామ కాజోల్ కరోనా బారిన పడ్డారు.
Kajol: సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా బాలీవు బామ కాజోల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాజోల్ సోషల్ మీడియాలో వేదికగా అనౌన్స్ చేశారు. రెండు మూడు రోజుల నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటీవ్ వచ్చిందని కాజోల్ వెల్లడించారు. ప్రస్తుతం కాజోల్ క్వారంటైన్లో ఉన్నారు.
కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు కాజోల్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త అదుపులోకి రాగా.. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 2లక్షల 34వేల 281 కరోనా కేసులు నమోదయ్యాయి. కాజోల్ 1992లో ‘బేఖుది’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1993లో షారుఖ్‌తో కలిసి నటించిన ‘బాజీగర్’ సినిమాతో హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు.
షారుఖ్‌తో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయింగే’ ‘ కుచ్ కుచ్ హోతా హై’ వంటి బ్లాక్ బస్లర్ సినిమాల్లో నటించిన కాజోల్.. బాక్సాఫీస్ వద్ద బెస్ట్ పెయిర్ అని నిరూపించుకున్నారు. బాలీవుడ్ వెండితెరపై షారుఖ్ కాజోల్‌ది సూపర్ హిట్ జోడీ. 1999లో కాజోల్ అజయ్ దేవగణ్‌ను పెళ్లి చేసుకోగా.. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్ ఉన్నారు.