Bimbisara 2 : చిరంజీవి మూవీతో బింబిసార సీక్వెల్ విషయంలో గొడవ.. కల్యాణ్‌రామ్ ససేమేరా..
బింబిసార 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక డైరెక్టర్ వశిష్ట.. చిరంజీవితో మూవీ కోసం కల్యాణ్‌రామ్‌కు ఝలక్ ఇచ్చాడట. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

Kalyan Ram Bimbisara 2 is struggled by Chiranjeevi commitment with Vasishta
Bimbisara 2 : కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా సోషియో ఫాంటసీ డ్రామాతో వచ్చిన సినిమా బింబిసార. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే.. ఈ చిత్రానికి కొనసాగింపు సినిమాలు వస్తాయంటూ కళ్యాణ్ రామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బింబిసార 2 పనులు స్టార్ట్ చేసి స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లు, త్వరలోనే మూవీని కూడా పట్టాలు ఎక్కించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక విషయం హాట్ టాపిక్ అయ్యింది.
Katrina Kaif : గత 20 ఏళ్లగా నా లైఫ్‌లోని ఎక్కువ సమయం అతనితో ఉన్నాను.. కత్రినా పోస్ట్ ఎవరి గురించి?
పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక డైరెక్టర్ వశిష్ట.. కల్యాణ్‌రామ్‌కు ఝలక్ ఇచ్చాడట. మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) మూవీకి వశిష్ట రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ టాక్. అది కూడా సోషియో ఫాంటసీ చిత్రమేనని చెబుతున్నారు. మెగాస్టార్ కు కథ బాగా నచ్చటంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట. ఈ విషయం తెలిసి కల్యాణ్‌రామ్ షాక్ అయ్యారు.
కొత్త డైరెక్టర్ అని ఎంకరేజ్ చేస్తే.. ఇప్పుడు సడెన్ గా చిరంజీవితో సెకండ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని డైరెక్టర్‌పై కల్యాణ్‌రామ్ అసంతృప్తి చెందుతున్నారట. ఒక వేళ వశిష్ట అలా చేస్తే ముందస్తు ఒప్పందం ప్రకారం.. తన రెమ్యూనరేషన్ నుంచి 40 శాతం పరిహారంగా కల్యాణ్‌రామ్‌కు ఇవ్వాల్సిసిందేనని అంటున్నారు. వశిష్ట మాత్రం పరిహారం ఇవ్వడానికి రెడీగా లేడు.. మెగాస్టార్ తో సినిమా తర్వాత కల్యాణ్‌రామ్‌తో బింబిసార 2 చేస్తానన్నాడని, కానీ దీనికి కల్యాణ్‌రామ్ మాత్రం ససేమేరా అనటంతో బింబిసార 2 ఇప్పుడు చిక్కుల్లో పడిందని చెబుతున్నారు.
OG Movie : నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్న సుజిత్.. ఈ షెడ్యూల్‌లో ఎమోషనల్ డ్రామా..!
హీరో, డైరెక్టర్ మధ్య ఈ సమస్య పరిష్కారం అయితేనే వశిష్ట చిరంజీవితో సినిమా చెయ్యడానికి దారి దొరుకుతుంది. ఇక మరో వైపు కల్యాణ్‌రామ్ రొమాంటిక్ మూవీ డైరెక్టర్ అనిల్‌ని బింబిసార 2 కోసం ఎంపిక చేసుకున్నాడనే గాసిప్స్ వినబడుతున్నాయి. వశిష్ట చెప్పిన స్టోరీతో సినిమా తీస్తే లీగల్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మధ్య వర్తులు ఒక రాజీ ఫార్మూల తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. వశిష్ట తన రెమ్యూనరేషన్ నుంచి 40 శాతం చెల్లించకుండా, వశిష్ట చిరంజీవితో సినిమా చెయ్యాలంటే వశిష్ట బింబిసార2 కథనే కల్యాణ్‌రామ్‌కు ఇచ్చేయాలనేది కండీషన్. ఈ ఇద్దరి మధ్య కుదిరే రాజీ ఫార్ములా ఆధారంగానే బింబిసార 2 సెట్స్ మీదకు వస్తుందంటున్నారు. అంతవరకు ఫ్యాన్స్ వేచిచూడాల్సిందే మరి.