Kalyan Ram : దేవర గ్లింప్స్.. బింబిసారా 2 అప్డేట్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..
డెవిల్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దేవర గ్లింప్స్, బింబిసారా 2 అప్డేట్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.

Kalyan Ram gave updates on Devara Glimpse and Bimbisara 2
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ఒక పక్క హీరోగా మరో పక్క నిర్మాతగా రాణిస్తూ వరుస ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. ప్రెజెంట్ హీరోగా ‘డెవిల్’ అనే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేశారు. ఇక నిర్మాతగా ఎన్టీఆర్ ‘దేవర’ని నిర్మిస్తున్నారు. తాజాగా డెవిల్ మూవీ ట్రైలర్ ని ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ దేవర గ్లింప్స్ గురించి అప్డేట్ ఇచ్చారు.
కళ్యాణ్ రామ్ కామెంట్స్.. “ఆర్ఆర్ఆర్ వంటి సినిమా చేసిన తరువాత హీరో, దర్శకుడు, కథ, ప్రొడక్షన్ వేల్యూస్ పై చాలా అంచనాలు ఉంటాయి. ఏ కథ పడితే అది, మాములు VFX లతో వస్తే మీరు ఊరుకోరు కదా. మేము ఒక అద్భుతమైన సినిమా ఇవ్వడానికి చాలా కష్ట పడుతున్నాము. బింబిసారా చిత్రంలో ఎలా ఒక కొత్త ప్రపంచాన్ని చూశారో. దేవర చిత్రంతో కూడా అలాగే ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకోసం టైం పడుతుంది. కాబట్టి దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే దేవర గ్లింప్స్ ని రిలీజ్ చేస్తాము” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.
Also read : Salaar : జాతకం చూసి ‘సలార్’ని రిలీజ్ చేస్తున్నాము.. నిర్మాత విజయ్ కిరంగదూర్
#KalyanRam says #Devara Glimpse is coming soon!! pic.twitter.com/4BuhhMcLfr
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) December 12, 2023
అలాగే బింబిసారా సీక్వెల్ గురించి కూడా ప్రశ్నించగా, కళ్యాణ్ రామ్ బదులిస్తూ.. 2024 ఏప్రిల్ లేదా మేలో స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. కాగా బింబిసారా సీక్వెల్ కథ ఆల్రెడీ రెడీ అయ్యిపోయిందని గతంలోనే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠ చిరంజీవితో మెగా156 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అవ్వగానే బింబిసారా పనులు మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. కాగా ఈ బింబిసారా వరల్డ్ లో ఎన్టీఆర్ కూడా భాగమయ్యే అవకాశం ఉందని కళ్యాణ్ రామ్ గతంలో చెప్పారు. మరి ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్ కనిపిస్తారా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.
ఇక డెవిల్ మూవీ విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అభిషేక్ నామా దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ నటిస్తుంటే మాళవిక నాయర్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆ స్పై యాక్షన్ థ్రిలర్ ట్రైలర్ ని మీరుకూడా ఒకసారి చూసేయండి.