KH233 : ఉలగనాయగన్‌.. KH233 షురూ.. వీడియో షేర్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌

గ‌తేడాది విక్ర‌మ్ (Vikram ) చిత్రంతో భారీ హిట్‌ను అందుకున్నాడు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan). ఈ చిత్ర విజ‌యం ఇచ్చిన ఉత్సాహాంతో ఆయ‌న వ‌రుస‌గా సినిమాల‌ను చేస్తున్నాడు.

KH233 : ఉలగనాయగన్‌.. KH233 షురూ.. వీడియో షేర్ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌

Kamal Haasan new movie update

KH233 Starts : గ‌తేడాది ‘విక్ర‌మ్’ (Vikram ) చిత్రంతో భారీ హిట్‌ను అందుకున్నాడు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan). ఈ చిత్ర విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో ఆయ‌న వ‌రుస‌గా సినిమాల‌ను చేస్తున్నాడు. ‘వ‌లిమై’, ‘తునివు’ చిత్రాల ద‌ర్శ‌కుడు హెచ్‌ వినోథ్‌ (H Vinoth) వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ ఓ చిత్రంలో న‌టించ‌నున్నాడు అనే విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. దీనికి KH233 వ‌ర్కింగ్ టైటిల్‌గా పెట్టారు. క‌మ‌ల్ కెరీర్‌లో ఇది 233వ సినిమా.

Shahrukh Khan : షూటింగ్‌లో షారుఖ్‌కి ప్రమాదం.. అమెరికాలో సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..

‘రైజ్‌ టు రూల్’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. క‌మ‌ల్ హాస‌న్ హోం బ్యాన‌ర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌పై కమల్‌ హాసన్‌-ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఉలగనాయగన్‌.. KH233 షురూ..’ అంటూ లాంఛ్ చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు గురించి ఎటువంటి వివ‌రాల‌ను తెల‌ప‌లేదు. త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు.

Ram Charan : ఇదేం యాడ్‌రా బాబు.. ఏజెంట్ లెవ‌ల్‌లో చ‌ర‌ణ్‌తో మీషో యాడ్

Samantha : సమంత ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌.. ‘చావు నుంచి మ‌న‌ల్నీ ఏదీ కాపాడ‌లేన‌ప్పుడు’.. మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా..?

ఇదిలా ఉంటే.. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ‘భార‌తీయుడు 2′ సినిమాలో న‌టిస్తున్నాడు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న’ప్రాజెక్ట్ K’ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను లోక‌నాయుడు పోషిస్తున్నాడు. ఇవే కాకుండా KH233 తో పాటు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో KH234 ప్రాజెక్టు క‌మ‌ల్ సైన్ చేశాడు.