Akshara Haasan : లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న కమల్ హాసన్ చిన్న కూతురు.. కాస్ట్ ఎంతో తెలుసా?

లోక నాయకుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ లగ్జరీ అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ముంబయి ఖర్‌లో ఆమె కొన్న ఆ అపార్ట్ మెంట్ కాస్ట్ ఎంతంటే?

Akshara Haasan : లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న కమల్ హాసన్ చిన్న కూతురు.. కాస్ట్ ఎంతో తెలుసా?

Akshara Haasan

Updated On : November 4, 2023 / 10:05 AM IST

Akshara Haasan : నటుడు కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ముంబయిలోని ఖర్‌లో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ అపార్ట్ మెంట్ కోసం ఆమె అక్షరాలా రూ.15.75 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

Samantha : అల్లు అర్జున్‌తో కలిసి సూపర్ హీరో సినిమా చేయాలని ఉంది..

కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ముంబయిలో సొంత ఇల్లు కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తల్లి సారికతో కలిసి ఉంటున్న అక్షర ముంబయి ఖర్ ప్రాంతంలో రూ.15 కోట్లకు పైన ఖర్చు పెట్టి అపార్ట్ మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఖర్ స్ట్రీట్ నెంబర్ 16 లో 15 అంతస్తుల ఏక్తా వెర్వ్ టవర్ ఉంది. అందులోని 13 వ అంతస్తులో 2,245 చదరపు విస్తీర్ణంలో ఉన్న 1303 నంబర్ ఫ్లాట్‌ను అక్షర కొనుగోలు చేసారట. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా మూడు కార్లు పట్టే స్పేస్ ఉందని తెలుస్తోంది.

అక్షర హాసన్ బాంద్రాకు చెందిన ఓ కపుల్ నుంచి ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేసారని సెప్టెంబర్ 27 వ తేదీన రిజిస్ట్రేషన్ అయ్యిందని స్టాంప్ డ్యూటీ క్రింద రూ.94.50 లక్షలు అక్షర చెల్లించారని కూడా తెలుస్తోంది. ఏక్తా వెర్వ్ అనేది ఏక్తా వరల్డ్ గ్రూప్‌కు చెందిన బొటిక్ లగ్జరీ ప్రాజెక్ట్. 15 అంతస్తుల లగ్జరీ టవర్‌లో 18 అపార్ట్ మెంట్లు ఉన్నాయట.

Nirupam Paritala : డాక్టర్ బాబు హీరోగా ఎందుకు చేయలేదు? సినిమాల్లో ఛాన్సులు రాలేదా?

కమల్ హాసన్ సారికలు 20 సంవత్సరాల క్రితమే విడిపోయారు. ముంబయిలో తల్లి సారికతో అక్షర హాసన్ కలిసి ఉంటున్నారు. శృతి హాసన్, అక్షర హాసన్ తరచు తండ్రి కమల్‌ను కలుస్తూ ఉంటారు. అక్షర హాసన్ అమితాబ్ బచ్చన్ సినిమా ‘షమితాబ్’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ్ సినిమా ‘వివేగం’ తో మంచి పేరు వచ్చింది. లాస్ట్ ఇయర్ తమిళ మూవీ ‘అచ్చం మేడం నానమ్ పయిరిప్పు’ సినిమాలో కనిపించిన అక్షర మరో తమిళ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.