Kandikonda Death: ఫిల్మ్ చాంబర్‌లో కందికొండ మృతదేహం.. ప్రముఖుల సందర్శన

తెలుగు సినీ గేయ రచయిత కంది కొండ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండకు గత కొన్ని నెలలుగా ట్రీట్‌మెంట్ జరుగుతోంది.

Kandikonda Death: ఫిల్మ్ చాంబర్‌లో కందికొండ మృతదేహం.. ప్రముఖుల సందర్శన

Kandikonda

Updated On : March 13, 2022 / 11:36 AM IST

Kandikonda Death: తెలుగు సినీ గేయ రచయిత కంది కొండ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండకు గత కొన్ని నెలలుగా ట్రీట్‌మెంట్ జరుగుతోంది. త్రోట్ క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం మాత్రం క్షిణిస్తూ రావడంతో శనివారం మోతి నగర్ లోని తన నివసిస్తున్న అపార్ట్ మెంట్ లో తుదిశ్వాస విడిచారు.

Kandikonda: విషాదం.. సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత!

కాగా, సందర్శనార్ధం ఆయన మృతదేహాన్ని ఆదివారం ఉదయం తెలుగు ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శన కొరకు మధ్యాహ్నం వరకు కందికొండ మృతదేహాన్ని ఫిలిం చాంబర్ లోనే ఉంచనుండగా.. ఆ తరువాత మహా ప్రస్థానంలో కందికొండ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఫిలిం ఛాంబర్ లో కందికొండ భౌతిక కాయాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించి నివాళులు అర్పించారు.

Kandikonda : చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో గేయ రచయిత.. ఆదుకునేవారు లేరా??

కందికొండ యాదగిరి మరణించడం చాలా బాధాకరమని తలసాని సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గొప్ప పాటలు రాసిన కందికొండ.. తెలంగాణ సమాజం, ఉద్యమం కోసం పాటలు రాశారు. ఆయన కుటుంబానికి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. తెలంగాణ సమాజానికి కందికొండ మరణం తీరని లోటని.. కందికొండ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.