Kangana Ranaut : అందుకే నాకు పెళ్లి కావట్లేదు.. కంగనా రనౌత్ వ్యాఖ్యలు..

ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో మీరు రియల్ లైఫ్ లో కూడా టామ్‌ బాయ్‌ లాగే ఉంటారా అని అడగడంతో కంగనా........

Kangana Ranaut : అందుకే నాకు పెళ్లి కావట్లేదు.. కంగనా రనౌత్ వ్యాఖ్యలు..

Kangana

Updated On : May 13, 2022 / 7:50 AM IST

Kangana Ranaut :  బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, క్వీన్ కంగనా రనౌత్‌ ఏం అనుకుంటే అది ఓపెన్ గా చెప్పేస్తుంది. ఎవరేమనుకున్నా పట్టించుకోదు. దేశం గురించి, తన గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. మాటలతోనే అవతలి వాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. ఇక తను చేసే ట్వీట్స్, పోస్టులు ప్రతీది వైరల్ అవ్వాల్సిందే. ఇటీవలే తను హోస్ట్ గా చేసిన లాకప్ షో పూర్తయింది. ప్రస్తుతం కంగనా ధాకడ్‌ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ చూసి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

 

Bandla Ganesh : గబ్బర్‌సింగ్‌కి పదేళ్లు.. హరీష్‌శంకర్‌కి అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల..

సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కంగనా. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో మీరు రియల్ లైఫ్ లో కూడా టామ్‌ బాయ్‌ లాగే ఉంటారా అని అడగడంతో కంగనా.. ”సినిమాల్లో కాకుండా బయట రియల్ లైఫ్ లో నేను ఎవరిని కొట్టానో చూపించండి. మీరు ఇలాంటి పుకార్లు సృష్టించడం వల్లే నాకింకా పెళ్లి అవ్వట్లేదు. నేను ఊరికే అందరితో గొడవలే పెట్టుకుంటానేమో అని జనాలు అనుకుంటున్నారు” అంటూ సరదాగా నవ్వుతూ చెప్పింది.