విమానంలో కంగనా…కరోనా నిబంధనలు గాలికి

  • Published By: venkaiahnaidu ,Published On : September 11, 2020 / 09:31 PM IST
విమానంలో కంగనా…కరోనా నిబంధనలు గాలికి

Updated On : September 11, 2020 / 9:46 PM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ నెల 9న చండీగఢ్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో ప్రయాణించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న సూచనలను వదిలేసి విమానంలో కొందరు మీడియా ప్రతినిధులు,ప్రయాణికులు ఆమె ఫోటోలు,వీడియోలు తీయడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.

విమానంలో కంగనా ఫోటోలు, వీడియోలు తీయడంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ నుంచి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వివరణ కోరింది. మరోవైపు దీనిపై తాము డీజీసీఏకు వివరించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. తాము నిర్దేశిత నిబంధనలను అన్నీ పాటించామంటూ వివరణ ఇచ్చింది.క్యాబిన్ సిబ్బంది, అలాగే ఫోటోగ్రఫీని పరిమితం చేసే కెప్టెన్ ప్రకటనలతో సహా అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించామని తెలిపింది.


కరోనా నేపథ్యంలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించడంతోపాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఆంక్షలపై స్పష్టమైన ప్రకటనలు జారీ చేసినట్లు ఇండిగో వెల్లడించింది. అయినప్పటికీ మీడియా సిబ్బంది, మరి కొందరు ఈ నిబంధనలు ఉల్లంఘించి నటి కంగనాను ఫోటోలు, వీడియోలు తీసినట్లు పేర్కొంది. కరోనా నిభందనలు,ఫోటోగ్రఫీ వంటి అంశాలను తమ సిబ్బందికి మరోసారి గుర్తుచేస్తామని ఇండిగో తెలిపింది.
.