Tejas Trailer : కంగనా రనౌత్ ‘తేజస్’ ట్రైలర్ రిలీజ్.. ఫైటర్ జెట్ పైలెట్‌గా కంగనా యాక్షన్ సీన్స్..

కంగనా రనౌత్ ప్రస్తుతం 'తేజస్' అనే యాక్షన్ థ్రిల్లర్ కథతో రాబోతుంది. కంగనా ఫైర్ జెట్ పైలెట్ గా కనిపించబోతున్న ఈ మూవీ ట్రైలర్ ని నేడు ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Tejas Trailer : కంగనా రనౌత్ ‘తేజస్’ ట్రైలర్ రిలీజ్.. ఫైటర్ జెట్ పైలెట్‌గా కంగనా యాక్షన్ సీన్స్..

Kangana Ranaut new movie Tejas Trailer released

Tejas Trailer : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవలే చంద్రముఖి 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతుంది. ‘తేజస్’ అనే ఒక లేడీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రాబోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా.. ఫైర్ జెట్ పైలెట్ గా కనిపించబోతుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Also Read : Thaman : అఖండ సినిమాలో థమన్ క్రెడిట్ ఏం లేదంటున్న బోయపాటి..

ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే కావడంతో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. కాగా ఆడియన్స్ ఈ మూవీకి URI-2 అని టైటిల్ ని పెట్టండి అంటూ అడుగుతున్నారు. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంతో 2019లో విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన సినిమా URI.. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు కంగనా చిత్రాన్ని ఉరి మేకర్స్ తెరకెక్కిస్తుండడంతో, స్టోరీ కూడా అలాంటి నేపథ్యంతోనే వస్తుండడంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూవీకి ఆ టైటిల్ పెట్టండి అంటూ సోషల్ మీడియా వేదిక కామెంట్స్ చేస్తున్నారు.

సర్వేశ్ మెవరా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 27న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. చంద్రముఖి 2 సినిమాతో అభిమానులను నిరాశపరిచిన కంగనా.. ఈ మూవీతో హిట్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా దసరా బరిలో ఇప్పటికే పలు బడా సినిమాలు ఉన్నాయి. సౌత్ లో బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో, శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమాలు ఉండగా బాలీవుడ్ లో గణపథ్ ఉంది. మరి వీటిలో ఏది విజయాన్ని అందుకుంటుందో చూడాలి.