Kangana Ranaut : తెలిసి తెలియని వయసులో బ్రేకప్.. పెళ్లికి ఇంకా ఐదేళ్లు ఆగాల్సిందే..
'తేజస్' సినిమా ప్రమోషన్లలో భాగంగా బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మీడియాతో తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు తన పెళ్లి ఎప్పుడో కూడా స్పష్టం చేసారు.

Kangana Ranaut
Kangana Ranaut : బ్రేకప్ వల్ల తనకు మంచే జరిగిందంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. తను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో కూడా స్పష్టం చేశారు. తన లేటెస్ట్ మూవీ ‘తేజస్’ ప్రమోషన్స్‌లో భాగంగా కంగనా తన ప్రేమ-పెళ్లి విషయంలో మీడియాతో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
Kangana Ranaut : కంగనా రనౌత్ బికినీ ఫోటో షేర్ చేస్తూ మాజీ ఎంపీ ట్వీట్.. ఫైర్ అయిన హీరోయిన్..
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘తేజస్’ సినిమా అక్టోబర్ 27న విడుదలైంది. ఈ సినిమాలో కంగనా IAF అధికారి తేజస్ గిల్ గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కంగనా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. గతంలో బ్రేకప్ అయిన తన రిలేషన్ గురించి చెప్పుకొచ్చారు. తెలిసీ తెలియని వయసులో తను ప్రేమలో పడ్డానని.. కొన్ని కారణాల వల్ల అది బ్రేకప్ అయినా దాని వల్ల తనకు మంచే జరిగిందని’ చెప్పారు కంగనా. లవ్ ఫెయిల్యూర్ వల్ల జరిగే మంచి చాలామందికి ఆలస్యంగా తెలుస్తుందని అన్నారు.
Kangana Ranaut : అత్త అయిన కంగనా రనౌత్.. మేనల్లుడిని ఎత్తుకొని మురిసిపోతూ..
ఇక పెళ్లి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు కంగనా రనౌత్. పెళ్లి, ఫ్యామిలీ గురించి ప్రతి అమ్మాయి కలలు కంటుందని.. తను కూడా కుటుంబ వ్యవస్థకు గౌరవం ఇస్తానని చెప్పారు కంగనా.. వచ్చే ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటానని, అది కూడా పెద్దలు కుదుర్చిన ప్రేమ వివాహం అయితేనే చేసుకుంటానని ఆమె స్పష్టం చేసారు. ఇక హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా కంగనా కెరియర్ కొనసాగుతోంది. తేజస్ ఆమె కెరియర్‌కు ప్లస్ అవుతుందేమో చూడాలి.