Vasishta Simha-Haripriya : పిల్ల జమీందార్ హీరోయిన్‌తో ఏడడుగులు వేసిన KGF నటుడు..

వశిష్ట, హరిప్రియ కలిసి ఓ సినిమాలో నటించారు. అప్పట్నుంచి వీరిద్దరిమధ్య స్నేహం ఏర్పడి అనంతరం అది ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వశిష్ట సింహ, హరిప్రియ తాజాగా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. జనవరి 26న మైసూరులో............

Vasishta Simha-Haripriya : పిల్ల జమీందార్ హీరోయిన్‌తో ఏడడుగులు వేసిన KGF నటుడు..

kannada actor Vasishta Simha and heroine Haripriya married

Updated On : January 27, 2023 / 8:27 AM IST

Vasishta Simha-Haripriya :  కన్నడ హీరోయిన్ హరిప్రియ తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాని సరసన పిల్ల జమిందార్ సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హరిప్రియ అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌, ఈ వర్షం సాక్షిగా, జైసింహా.. సినిమాల్లో నటించింది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కన్నడలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల కొన్ని నెలల క్రితం హరిప్రియ కన్నడ నటుడు వశిష్ట సింహని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించింది.

Suhas: సినిమాలని టెలిగ్రామ్ పైరసీలో చూస్తున్నారు.. టెలిగ్రామ్ వల్లే గ్రామాల్లో కూడా ఫేమస్ అయ్యా..

కన్నడ నటుడు వశిష్ట సింహ అనేక కన్నడ సినిమాల్లో నటించాడు. KGF లో మంచి పాత్ర వేశాడు. తెలుగులో.. నారప్ప, నయీం డైరీస్‌, ఓదెల రైల్వేస్టేషన్‌.. లాంటి పలు సినిమాల్లో నటించాడు. వశిష్ట, హరిప్రియ కలిసి ఓ సినిమాలో నటించారు. అప్పట్నుంచి వీరిద్దరిమధ్య స్నేహం ఏర్పడి అనంతరం అది ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వశిష్ట సింహ, హరిప్రియ తాజాగా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. జనవరి 26న మైసూరులో హరిప్రియ, వశిష్ట సింహ ఏడడుగులు వేశారు. వీరి పెళ్ళికి పలువురు కన్నడ సినీ ప్రముఖులు విచ్చేసి ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.